(Image source from: health.economictimes.indiatimes.com)
ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిపై తన ప్రభావాన్ని చూపుతున్న కరోనా మహమ్మారి లక్షలాది మందిని కబళించింది. కాగా, తాజాగా శృంగార ఔషదం మాత్రం కరోనా ప్రభావం తీవ్రంగా వున్న రోగుల్లోనూ ఆశలు రేకెత్తిస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్న రోగుల్లోనూ ఉపశమనం కల్పిస్తోంది. ఇంతకీ ఈ శృంగార ఔషదం ఏమిటంటారా.?అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్ఎఫ్-100 (అవిప్టడిల్) ఔషధమే ఇది. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినా.. దానికి ఆర్ఎల్ఎఫ-100 విరుగుడుగా పనిచేస్తోందని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
దీనిని సాధారణంగా ముక్కు ద్వారా పీల్చడం ద్వారం అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఔషదాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులకు బహుళ క్లినికల్ సైట్లలో అత్యవసరంగా ఉపయోగించడం కోసం ఎఫ్‌డీఏ చేత ఆమోదించబడింది. చికిత్సలో వాడిన తర్వాత వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితులు వేగంగా కోలుకున్నట్లు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ నివేదించింది. ఈ మందు పేటెంట్ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్ కంపెనీ రిలీఫ్ థెరపాటిక్స్, ఇజ్రాయెలీ-అమెరికన్ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ఔషధాన్ని ఉపయోగించి కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు జూన్ నెలలో అనుమతులు లభించాయి.
అమెరికాలోని హ్యూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 54 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో అతనికి కరోనా సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తడంతో అతనికి ఆర్ఎల్ఎఫ్-100 ఔషదాన్ని ఇచ్చారు. అతడి ఆరోగ్యం నాలుగు రోజుల వ్యవధిలోనే మెరుగుపడి వెంటిలేటర్‌పై నుంచి జనరల్ వార్డుకు మారారు. మరో 15 మంది కూడా ఇదే విధంగా త్వరగా కోలుకున్నారు. దీంతో మరి కొందరిపై ప్రయోగాలు చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగ ఫలితాలు మరింత సానుకూలంగా వస్తే కరోనా నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంది. కాగా.. ఆర్ఎల్ఎఫ్-100 ఔషదం వాడటం వల్ల మోనోసైట్స్‌లో తెల్లరక్తకణాల సంఖ్య వృద్ధి చెందకుండా నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more