Google Deletes 2500 Chinese Youtube Channels చైనా ఆర్థిక మూలంపై మరో దెబ్బ.. చానెల్స్ డిలీట్ చేసిన యూట్యూబ్..

Google deletes 2500 china linked youtube channels over disinformation

coronavirus, covid-19, Alphabet, China-Linked YouTube Channels, Google, Political Campaign, social media, TikTok, US Presidential Elections 2020, YouTube, YouTube channels

Google says it has deleted more than 2,500 YouTube channels tied to China as part of its effort to weed out disinformation on the video-sharing platform. The Alphabet -owned company said the channels were removed between April and June 'as part of our ongoing investigation into coordinated influence operations linked to China.'

చైనా ఆర్థిక మూలంపై మరో దెబ్బ.. చానెల్స్ డిలీట్ చేసిన యూట్యూబ్..

Posted: 08/07/2020 10:09 PM IST
Google deletes 2500 china linked youtube channels over disinformation

చైనాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ దానిని ఎలా కట్టడి చేసే చర్యలకు ఉపక్రమిస్తుండగా, చైనా మాత్రం భారత్ పై కయ్యానికి కాలు దువ్వి ప్రపంచాన్నే తన శత్రువుగా మలుచుకుంది. ఈ క్రమంలో భారత్ చైనా ఆర్థిక మూలమైన పలు యాప్ లను నిషేధించి దెబ్బ కొట్టింది. తాజాగా గూగుల్ కూడా చైనాను మరో దెబ్బ కోట్టింది. చైనాకు చెందిన ఏకంగా 2500 యూట్యూబ్ చానల్స్ ను గూగుల్ డిలీట్ చేసింది. చైనాతో సంబంధం ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను గూగుల్ సంస్థ తొలగించింది. గత ఏప్రిల్-జూన్ నెలల మధ్య వీటిని తొలగించినట్లు గూగుల్ తెలిపింది.

సమాచారాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాయనని ఈ యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టుగా తెలుస్తోంది. దీనిపై స్పందించాలని గూగుల్ సంస్థ కోరగా అమెరికాలోని చైనా ఎంబాసి రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. సాధారణంగా నాన్ పొలిటికల్ కంటెంట్ ను యూట్యూబ్ చానల్స్ పోస్ట్ చేస్తాయి. కానీ తప్పు ప్రచారాలను ప్రసారం చేసే చానల్స్ లను గుర్తించి గూగుల్ వాటిని తొలగించింది. కాగా..సమాచారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అనే కారణంతో భారత ప్రభుత్వం 59 చైనా యాప్ లను బ్యాన్ చేసిన సంగతి తెల్సిందే. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. మరికొన్ని చైనా యాప్ లను బ్యాన్ చేయడానికి కూడా చర్యల్ని తీసుకుంటోంది. ఈ క్రమంలో మరికొన్ని దేశాలు కూడా చైనా యాప్ లను బ్యాన్ చేయడానికి సన్నద్ధం అవుతున్నాయి.

కాగా అమెరికా కూడా టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేస్తానమి ట్రంప్ చెప్పారు. అనుకున్నట్లుగానే అమెరికాలో టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ నిషేధిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన వచ్చే 45 రోజుల్లో అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ఆయన జారీ చేశారు. టిక్ టాక్ తో పాటు.. వుయ్ చాట్ పైనా అమెరికా నిషేధం విధించింది. అమెరికా నిబంధనల ప్రకారం టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో పాటు వుయ్ చాట్ పై కూడా నిషేధం విధిస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ నాయకులకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. చైనాకు సంబంధించిన యాప్ లను వివిధ దేశాలు ఒక్కొక్కటిగా బ్యాన్ చేస్తూ వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles