(Image source from: Indiatoday.in)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా రెండు లక్షల తొంభై ఆరు వేల మార్కుకు చేరువలో వున్నాయి, ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఏడు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. ఇవాళ కాసింత తగ్గుముఖం పట్టాయి, ఏడు వేల మార్కుకు పైగాకేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా రెండు లక్షల 96 వేల మార్కుకు అధిగమించాయి. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
ఇటీవల కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏడు వేలకు చేరువలో కేసులు నమోదు కావడం స్వల్ప ఊరటనిస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా రెండు లక్షల 96 వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 6780 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 2,96,609 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా తొమ్మిది వందల సంఖ్యలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదు కావడం.. దీంతో పాటు చిత్తూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదు వందలకు మించిన స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి, గత వారం ఈ జిల్లాల్లో అటుఇటుగా వెయ్యి మార్కును అందుకున్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం అధికార యంత్రాంగానికి స్వల్ప ఊరటనిస్తోంది, ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 535, చిత్తూరు జిల్లాలో 458, తూర్పు గోదావరి జిల్లాలో 911, గుంటూరు జిల్లాలో 776, కడప జిల్లాలో 523, కృష్ణా జిల్లాలో 135, కర్నూలు 372 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.
నెల్లూరు జిల్లాలో 481, ప్రకాశం జిల్లాలో 357, శ్రీకాకుళం జిల్లాలో 527, విశాఖపట్నం జిల్లాల్లో 519, విజయనగరంలో 462, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 724 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 82 మంది అసువులు బాసారు. ప్రకాశం, తూర్పు గోదావరి, చిత్తూరు, గుంటూరు, కడప జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి.
ప్రకాశం జిల్లాలో పదమూడు మంది, తూర్పు గోదావరి జిల్లాలో పది మంది, చిత్తూరు జిల్లాలో ఎనమిది మంది; గుంటూరు జిల్లాలో ఏడుగురు, కడప జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, అనంతపురం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఐదుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,732కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,09,100 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 84,777 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more