(Image source from: m.economictimes.com)
దేశంలో పసిడి దిగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ లో అంతకంతకూ పెకి ఎగబాకిన పసిడి శ్రావణ మాసం పూర్తి కాకుండానే వన్నె తగ్గింది. ఇటు కొనుగోళ్లదారులు లేకపోవడంతో బంగారాన్ని దిగుమతి చేసుకునే విషయంలోనూ వ్యాపారులు నిరాసక్తిని కనబరుస్తున్నారు, బంగారం, వెండి ధరలకు రెక్కలు రావడంతో ఒకవైపు అమ్మకాలు పడిపోగా, మరోవైపు, దిగుమతులు కూడా దారుణంగా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్-జులై మధ్య కాలం నాటి దిగుమతులతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 81.22 శాతం తగ్గి 247 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 18,590 కోట్లు)కు పడిపోయాయి. వెండి దిగుమతులదీ అదే పరిస్థితి.
గత నాలుగు నెలల్లో 56.5 శాతం తగ్గి 68.53 కోట్ల డాలర్ల ( దాదాపు 5,185 కోట్లు)కు క్షీణించాయి. ఫలితంగా వాణిజ్య లోటు అదుపులోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 5,940 కోట్ల డాలర్ల నుంచి 1,395 కోట్ల డాలర్లకు తగ్గింది. నిజానికి మార్చి నుంచే పసిడి దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్చిలో బంగారం దిగుమతులు 62.6 శాతం, ఏప్రిల్‌లో 99.93 శాతం, మేలో 98.4 శాతం, జూన్‌లో 77.5 శాతం తగ్గాయి. జులైలో మాత్రం స్వల్పంగా పుంజుకుని 4.17 శాతం పెరిగాయి. మరోవైపు, బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో అమ్మకాలు కూడా పడిపోయాయి.
గతేడాది ఏప్రిల్-జులై మధ్యతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో భారత్ నుంచి ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి 417 కోట్ల డాలర్లకు పడిపోయాయి. కాగా బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్ వార్షికంగా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇకపోతే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ తగ్గింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పడిపోయింది. దీంతో ధర రూ.55,650కు తగ్గింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,000కు క్షీణించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more