Pranab Mukherjee's Condition Unchanged: Hospital అందొళనకరంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Pranab mukherjees condition unchanged on ventilator support hospital

Pranab Mukherjee, Ventilator, health condition, former president, Army Research and Referral Hospital, brain surgery, COVID-19, coronavirus, corona positive, cororna Tpr rate, India coronavirus cases

'The condition of Hon'ble Shri Pranab Mukherjee remains unchanged this morning. He is deeply comatose with stable vital parameters and he continues to be on ventilatory support,' said a statement from the Army Research and Referral hospital.

కోమాలోకి మాజీ రాష్ట్రపతి.. అందొళనకరంగానే ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Posted: 08/19/2020 03:21 AM IST
Pranab mukherjees condition unchanged on ventilator support hospital

(Image source from: Thequint.com)

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యg విషమంగానే ఉంది. బ్రెయిన్ లో ఏర్పడిన క్లాట్ ను తొలగించే విషయమై వైద్యులు చేసిన శస్త్రచికిత్స తరువాత ఆయన కోమాలోకి జారుకున్నారు. దీంతో ఆయనకు వెంటిలేటర్ ను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్న ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు.. ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో మాజీ రాష్ట్రపతి పరిస్థితి ఇంకా విషమంగానే వుందని పేర్కోన్నారు. వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నా ఇప్పటికీ ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు కానరాలేదని తాజా బులిటెన్ లో వెల్లడించారు.

కాగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని నిఫుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని అసుపత్రి వర్గాలు తెలిపాయి, బ్రెయిన్ సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని, దీనికి తోడు ఆయనకు కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని కూడా నిర్థారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆయనకు క్లిష్టమైన ఆపరేషన్ చేశామని అసుపత్రివర్గాలు వెల్లడించాయి, ఇక తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని, తనను గత వారం రోజులుగా కలసిన వారందరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్ లో వుండాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన గత శనివారం రోజున ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles