Sister Says Singer SP Balasubrahmanyam is Off Ventilator కోలుకుంటున్న ఎస్పీ బాలు: ఎస్సీ శైలజ

No complications in sp balasubrahmanyams health says his son spb charan

SP balasubramaniam hindi songs list, SP balasubramaniam, SP Sailaja, SP balasubramaniyaam songs list, SP balasubramaniam songs, Who is sp Balasubrahmanyam, SPB Breathless, spb ilaiyaraaja, spb ilayaraja controversy, Balu, Singer Balu, Who is SPB

Veteran playback singer SP Balasubrahmanyam is recovering from Covid-19 and has been taken off the ventilator. His sister, SP Sailaja, informed in a voice note that her brother is making progress and is under close monitoring by the doctors

కరోనా నుంచి కోలుకుంటున్న ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు..

Posted: 08/19/2020 03:32 AM IST
No complications in sp balasubrahmanyams health says his son spb charan

(Image source from: India.com)

కరోనా మహమ్మారి బారిన పడిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి కాస్త కొలుకుంటున్నారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆయన పరిస్థితిపై అమె అసుప్రతి వైద్యులను అరా తీశారు. తన సోదరుడు కొలుకుంటున్నారని చెప్పారు. వెంటిలేటర్ సాయం లేకుండా ఆయన శ్వాస తీసుకుంటున్నారని అమె తెలిపారు. వైద్యుల చికిత్స నేపథ్యంలో ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని అమె ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అన్నయ్య వెంటిలేటర్ సాయంతో ప్రాణవాయువు అందిస్తున్నారని.. ఆయన పరిస్థితి విషమించిందన్న వార్తలను ఆమె ఖండించారు.

కరోనా బారిన పడటంతో ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘‘నమస్కారమండీ.. అన్నయ్య ఆరోగ్యం రోజురోజుకూ మెరుగవుతోంది. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. ఇది సంతోషించాల్సిన విషయం. ప్రస్తుతం ఆయనకు ఉంచిన వెంటిలేటర్‌ తొలగించారు. మిగిలినవి కొనసాగుతున్నాయి. అన్నయ్య కోలుకుంటున్న తీరుపట్ల వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీబీ ఆరోగ్యంగా ఉండాలని ప్రపంచమంతా ప్రార్థిస్తోంది. తప్పకుండా అన్నయ్య కోలుకుని వచ్చేస్తారు. అందరికీ ధన్యవాదాలు’’ అని ఎస్పీ శైలజ ఆడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. ‘‘ఎస్పీబీ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కలిసి ఒకేసారి ప్రార్థిస్తే, అది మరింత శక్తిమంతంగా ఉంటుంది. అందుకే ఈ రోజు(18వ తేదీ)సాయంత్రం 6గంటలకు యూనివర్సల్‌ మాస్‌ ప్రేయర్‌ చేద్దామని అనుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా బాలుగారికి ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఎక్కడ ఉన్నా సరే ఒకేసారి ప్రార్థనలు చేద్దాం’’ అని ఆర్పీ పట్నాయక్‌ పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles