Death Threat to tollywood music director నిట్టనిలువునా మోసపోయిన సంగీత దర్శకుడు.. చంపేస్తామని బెదిరింపు.!

Death threat vandemataram srinivas files police compliant

Vandemataram Srinivas, Tollywood Music director, Death Threat, Vandemataram Srinivas death threat, Tollywood Music director death threat, Thirupataiah, walking friends, contractor, Rs 28 Lakh, banjara hills police, Hyderabad, Telangana, Crime

Tollywood Music director Vandemataram Srinivas files police complaint as he recieves death threat from a Contractor and walking friend Thirupataiah. Banjara Hills police had registered a case against contractor, the threat was issued after the music director asked him to repay his Rs 28 Lakh amount which given as hand loan.

నిట్టనిలువునా మోసపోయిన సంగీత దర్శకుడు.. చంపేస్తామని బెదిరింపు.!

Posted: 11/21/2020 07:20 PM IST
Death threat vandemataram srinivas files police compliant

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ను హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బంజారాహీల్స్ పోలిసులను ఆశ్రయించారు. వందేమాతరం శ్రీనివాస్ పిర్యాదుపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు, కాగా ఈ ఇద్దరు నిందితులు తమ పథకం ప్రకారమే శ్రీనివాస్ తో స్నేహం చేసి మోసం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు నిందితులపై మోసం, నయవంచన, బెదిరింపులకు పాల్పడిన సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. అయితే నిందితులకు సంగీత దర్శకుడ్ని చంపుతామని బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం ఎందుకువచ్చింది..

పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్ కు చెందిన వందేమాతరం శ్రీనివాస్ అలియాస్ కె.శ్రీనివాస్ రావుకు ప్రతిరోజు మార్నింగ్‌ వాక్ చేసే అలవాటు ఉండటం చేత ఆయన సమీపంలోని కేబీఆర్ పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేస్తుంటారు. ఇదే సమయంలో ఫిలింనగర్ అపోలో ఆసుపత్రి సమీపంలో నివసించే తిరుపతయ్యతో ఆయనతో పరిచయం ఏర్పర్చుకున్నారు, వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలో 2018లో కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చెందిన కాంట్రాక్టర్ అయిన తన మామయ్య రంగస్వామితో కలిసి తిరుపతయ్య.. వందేమాతరం శ్రీనివాస్ ను కలిశాడు. ఈ సందర్భంగా వ్యాపార విస్తరన నిమిత్తం తనకు కొంత డబ్బు అవసరం అయ్యిందని కోరారు.

తనకు రూ. 30 లక్షలు సర్దితే నాలుగు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని కోరారు. కొత్తగా చిగురించిన స్నేహం.. ఇవ్వకపోతే స్నేహానికి బీటాలు వారుతాయని భావించిన శ్రీనివాస్.. రెండు సార్లు రూ.పది లక్షల చొప్పున, మరోసారి రూ.8 లక్షలు చోప్పున మూడు విడతలుగా రూ.28 లక్షలను ఇచ్చాడు. అయితే నాలుగు నెలల్లో గడిచినా డబ్బు తిరిగి చెల్లించకుండా.. తిరుపతయ్య, రంగస్వామిలు ఇప్పుడు, అప్పుడు అంటూ మాయమాటలు చెప్పడమే కాకుండా ముఖం చాలేశారు, దీంతో తన స్నేహితుడైన మధుసూదన్ రెడ్డితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ డబ్బుల కోసం అడిగాడు. దీంతో చంపేస్తానంటూ శ్రీనివాస్ ను తిరుపతయ్య బెదిరించాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు తిరుపతయ్య, రంగస్వామిలపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles