తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి తఁహసీల్దార్ పై పిర్యాదు చేయాల్సిన అవసరమేంటీ.? ఇదిలా వుంచితే షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి కేకే తనయపై పోలీసులకు పిర్యాదు చేయాల్సిన అవసరమేంటీ.? ప్రజలకు జారీ చేయాల్సిన పలు ప్రభుత్వ పథకాలు నత్తనడకన మంజూరు చేస్తున్నారని, ఆదాయ సహా ఇతర దృవపత్రాలు జారీలోనూ జాప్యం చేయడం వాటిని తిరస్కరించడం లాంటివి చేస్తున్నారని మహిళా కార్పోరేటర్ విజయలక్ష్మీ పిర్యాదు చేశారు.
కాగా కార్పోరేటర్ విజయలక్ష్మీ 10 నుంచి 15 మంది అనుచరులతో తన కార్యాలయానికి వచ్చి దాడి చేసిందని, అసభ్య పదజాలంతో దూషించిందని తహసీల్దార్ పిర్యాదు చేశారు. ఓ కేసు విషయమై తాను ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్లాల్సివుండగా తనను కోర్టుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆయన పిర్యాదులో పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తన కార్యాలయంలో ఓ సమావేశంలో వుండగా అక్కడి తన డివిజన్ వాసులు వచ్చి పలు విషయాలపై పిర్యాదు చేయగా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, పథకాలను పేదలకు అందించడంలో జాప్యం కొనసాగింతుందని, ఇక పలు దృవీకరణ పత్రాల జారీలోనూ తిరస్కరాలు అధికమయ్యాయని చెప్పారని అన్నారు.
దీంతో ప్రజల పిర్యాదుల నేపథ్యంలో ఎమ్మార్వోకు ఫోన్ చేయగా, ఆయన ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఇప్పుడు టైం లేదని.. ఫోన్ పెట్టేయడం.. ఆ తరువాత రెండు పర్యాయాలు ఫోన్ చేసినా లిప్టు చేయకపోవడంతో తానే కార్యాలయానికి వచ్చానని.. అయినా ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు లేదని, తనలాంటి ప్రజాప్రతినిధులతోనే ఇలా వ్యవహరిస్తే ఇక సాధారణ ప్రజలతో ఎలా వ్వవఁహరిస్తోరో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని అమె అన్నారు. దీంతో తన కార్యాలయ సిబ్బందితోనూ తమను నెట్టి వేయించారని తాను పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు కార్పోరేటర్ విజయలక్ష్మీ తెలిపారు.
బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మీ తనపై దాడి చేసిందంటూతహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా తనను అడ్డుకుని తాను తహసీల్దార్ కార్యాలయం ఎదుట నానా హంగామా చేసిందని.. అమెతో పాటు అమె వెంట వచ్చిన అనుచరులు కూడా తనపై దుర్భాషలాడారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన విధులకు ఆటంకం కలిగించి.. తనను ఉద్యోగ విధుల రిత్యా హైకోర్టుకు వెళ్లనీయకుండా అడ్డకున్నారని అరోపించారు. తన గది నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుని నెట్టివేశారని పిర్యాదులో పేర్కోన్నారు. ఇరువరి అరోపణలను స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరి పిర్యాదులపై న్యాయ నిపుణుల సూచనలను తీసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more