పెద్దలు చెవి దెగ్గర గూడు కట్టుకునేట్లుగా చెబుతుంటారు. ప్రమాదాల నివారణలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతీ జాతీయ రహదారిపైన.. ఈ మధ్య టోల్ ప్లాజాలపైనా పెద్ద పెద్ద అక్షరాలతో కూడా నిదానమే ప్రధానము.. అంటూ రాస్తున్నారు. అయినా యువతలో నిదానమన్న లక్షణాలు లేకుండా పోతున్నాయి. దీంతో నిండు నూరేళ్లు చల్లగా బతకాల్సిన యువకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరికోందరు అవయవాలు పోగొట్టుకుని అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఇన్నింటీకి వేగమే కారణమని తెలిసినా.. వేగం కోసం ప్రాణాలను పనంగా పెడుతున్నారు.
అయితే అదృష్టవంతులు మాత్రం కొద్దిలో తప్పించుకుంటున్నారు. లక్ వున్నంత వరకే ఇలా మరి లాక్ కలసి రానప్పుడు ఏంటీ..? అన్న ప్రశ్న ఉదయించక మానదు. అయితే నిదానంగా వెళ్తే ఎంతటి ప్రమాదం నుంచైనా చక్కగా తప్పించుకోవచ్చునన్న విషయం తెలియాల్సిందే. ఇక మరీ ముఖ్యంగా రైల్వే గేట్ పడిన తరువాత దాని కింద నుంచో లేక పక్క నుంచో చటుక్కున వచ్చేసి రైలు వచ్చేలోపు దాటి వెళ్లిపోదామనుకునేవారి సంఖ్య కూడా అధికంగానే వుంది. ఇలాంటి ఘటనల్లో ప్రమాదాలు ఎంత భయంకరంగా వుంటాయో కూడా తెలిసినా.. చూసినా.. ఇలా దాటేవారిలో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.
ఇలా తనకేం జరుగుతుంది అన్న భావనతో వున్న ఓ యువకుడు.. బైక్ పై రైల్వే గేటు వేసి వున్నా.. దానిని దాటుకుని ఏకంగా పట్టాల వద్దకు వచ్చి దాటేందుకు ప్రయత్నించినంతలో వైగంగా దూసుకువస్తున్న రైలును చూసి ఆగాడు. అయితే బైక్ ఇంజన్ ను మాత్రం ఆపలేదు. దీంతో బైక్ యాక్సిరలేటర్ పై చేయి పడి బైక్ ఒక్కసారిగా ముందుకు కదిలింది. అంతే బైక్ రైలు పట్టాలపై పడింది. దీంతో వెనక్కు లాగుదామని ప్రయత్రించే లోపు రైలు రానే వచ్చింది. దీంతో భయంతో యువకుడు వెనక్కు జరిగాడు. రైలు వేగానికి బైక్ మరింత ముందుకు జరిగింది.
దీంతో రైలు చక్కాల కిందకు వెళ్లేలేక దాని వేగానికి అక్కడే వున్న స్థంబానికి తగిలింది. ఆ వెంటనే చక్కని బైక్ కాస్తా పదహారు ముక్కలైంది. ఇది చూసిన యువకుడు తలపై చేయి పెట్టుకున్నాడు. అప్పుడు కానీ యువకుడికి నిధానమే ప్రధానమంటే తెలిసిరాలేదు అనుకుంటా. రైల్వే గేటు వేసిన తరువాత దానిని దాటుకుని లోనిక వచ్చి.. రైలు పట్టాలపైకి చేరుకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయన్న విషయం బోధపడలేదు. ఇక తన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో కూడా యువకుడికి అర్థమయ్యివుండదు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రైల్వేగేట్ వద్ద జరిగింది. మీరూ ఈ వీడియోను ఓ లుక్కేయ్యండీ..!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more