పార్లమెంట్ క్యాంటీన్ లో చట్టసభ సభ్యులకు దశాబ్దాలుగా అందిస్తోన్న సబ్సీడీని రద్దు చేయాలన్న ప్రయత్నాలకు ఎట్టకేలకు విజయవంతం చేశారు లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా. క్యాంటీన్ లో లభించే రాయితీ అహారాన్నికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్న ఆయన ఈ అదేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నుంచే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్.. పార్లమెంటు క్యాంటిన్ లో లభించే కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త జాబితాలో ధరల మోత భగ్గుమంది. దీంతో ధరాఘాతం ప్రభావం ఎంపీలకు కూడా తెలియనుంది.
ఇక కొత్త ధరల ప్రకారం పార్లమెంటు క్యాంటీన్ లో అత్యంత చౌకగా ఒక చపాతీ రూ.3కి లభిస్తుండగా.. అత్యంత అధిక ధర నాన్ వెజ్ బఫెకు నిర్ణయించారు. మాంసాహార బపెను తినాలనుకునే వారు తప్పక తమ జేబుల్లోంచి రూ.700లు వెచ్చించాల్సిందే. ఇక శాఖహార బపెకు మాత్రం రూ. 500లుగా నిర్ణయిస్తూ కొత్త ధరల పట్టికను లోక్ సభ సెక్రటేరియట్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర తరపున పార్లమెంటు క్యాంటీన్ జాబితాలో చోటు దక్కించుకున్న గుమగుమలాడే హైదరాబాదీ మటన్ బిర్యానీ కూడా ఇకపై ఘాటెక్కనుంది.
ఇటీవల దీనిని క్యాంటీన్ లో ప్రవేశపెట్టిన నాటి నుంచి కేవలం రూ.65లకే అందరికీ అందుబాటులోకి వచ్చిన బిర్యానీ ఇకపై మాత్రం బయట హోటళ్లలో లభించే విధంగానే రూ.150కు లభించనుంది. అలాగే శాఖాహార బోజనం చేయాలనుకునే వారు ఇక నుంచి రూ.100ని ఖర్చు చేయాల్సిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతీ ఏటా సుమారు రూ. 8 కోట్ల రూపాయలను అదా చేయనున్నట్లు సమాచారం. అలాగే ఇక నుంచి ఈ క్యాంటీన్ ను భారత పర్యాటక అభివృధ్ది కార్పొరేషన్ నిర్వహించనుందని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more