దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు పచ్చజెండాను ఊపిన నేపథ్యంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికార నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ్టి నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మరోమారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ మరో లేఖను రాశారు. ఈ సారి లేఖలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పేర్కోన్నారు.
రెండురోజుల క్రితం గుంటూరు కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్, చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్భన్ ఎస్పీ రమేష్ రెడ్డీలను బదిలీ చేయాలని అదేశిస్తూ సీఎస్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ ఈ సారి ఏకంగా సీఎం జగన్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను టార్గెట్ చేశారు. ఆయన ఎన్నికల విధుల్లో పాల్గోనకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సకాలం జరగేలా చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్ ప్రకాష్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన తెలిపారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాను ఈ నెల 23న నిర్వహించాల్సిన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలు జరగకుండా చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ పాత్ర వుందన్న ఆయన తన అదేశాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ గా వున్న ప్రవీణ్ ప్రకాష్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అధికారులను ఎన్నికలకు సన్నధం చేయడంలోనూ ఆయన పాత్ర వుందన్న నిమ్మగడ్డ.. ప్రవీణ్ ప్రకాష్ కారణంగానే ఎన్నికలను రీ-షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇక అంతుకుముందు రాసీన మరోలేఖలో దృవీకరణ పత్రాలపై సీఎం ఫోటోలను తొలగించాలని కూడా అదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వా ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలో పిర్యాదు చేశారు. ఇక మంత్రులు కూడా ఎన్నికల నియమావళి కొనసాగుతున్న క్రమంలో లక్ష్మణ రేఖ దాటారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more