ఇంధన ధరలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపైనే పడింది. ఏ బైక్.. లేదా ఏ ఈవీ టూవీలర్.. ఎన్ని కిలోమీటర్ల మైలైజ్.. ఎన్ని గంటల చార్జింగ్.. ఎంతటి వేగం అన్న అంశాలపైనే ఎక్కువగా చర్చసాగుతోంది. ఎక్కడ ఏ నలుగురు చర్చించుకున్నా అందులో ఇద్దరు ఈవీ టూవీలర్స్ విషయాన్నే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందుకు ఇంధన ధరలపై పన్నుల భారం మోపి.. సామాన్యుడి భయకంపితుడయ్యేలా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం కూడా లేకపోలేదన్న వాదనలు వున్నాయి.
ఈ నేపథ్యంలో కాసింత తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అచ్చంగా యమహా ఆర్ఎక్స్ 100 తరహాలో రూపోందిన ఎలక్ట్రిక్ బైక్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ముందుగా ఈ బైక్ వివరాలను తెలుసుకోండి. హైదరాబాదుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ స్టార్టప్ అటుమొబైల్.. తమ కేఫ్-రేసర్ స్టైల్డ్ ఆటమ్ 1.0 మోడల్ బైక్ కు డిజైన్ పేటెంట్ ను సొంతం చేసుకున్నది. స్పోర్టియర్ రైడింగ్ భంగిమ, 14 లీటర్ల స్టోరేజి ట్యాంక్, ఆకర్షణీయ బాడీ స్ట్రక్చర్ కుగాను ఈ పేటెంట్ దక్కినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
స్టాండర్డ్, స్పోర్ట్, క్రూయిసర్ తదితర బహుళ రైడింగ్ భంగిమలు తమ బైక్ ప్రత్యేకతలని, తమ ఆర్ అండ్ డీ బృందం దీనికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్లు సంస్థ సీఈవో గడ్డం వంశీ తెలిపారు. గతేడాది అక్టోబర్ 5న ఈ మోడల్ ను పరిచయం చేయగా, అప్పట్నుంచి దేశవ్యాప్తంగా 850 బుకింగ్ లు వచ్చాయని తెలిపారు. కాగా, ఏడాది వ్యారంటీతో వున్న లిథియం-ఇయాన్ బ్యాటరీ నాలుగు గంటల్లో పూర్తి చార్జ్ అవుతుందని, ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. పటాన్ చెరువులో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. లో-స్పీడ్ బైక్ కింద దీనికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more