మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు క్రితం రోజు రాత్రి పోలీసులకు ఫోన్ కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగి అప్రమత్తమైన ముంబై పోలీసు క్రైం బ్రాంచ్ ఈ ఫోన్ కాల్ చేసినట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిని విచారిస్తున్నారు. ఎందుకిలా ఫోన్ కాల్ చేశారన్న వివరాలను సేకరిస్తున్నారు. ముంబైలోని సీఎస్‌టీ, దాదర్, బైకుల్లా రైల్వేస్టేషన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో.. అక్కడికెళ్లి తనిఖీలు చేశారు.
అనంతరం అది ఫేక్ కాల్ అని బాంబు స్క్వాడ్ అధికారులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా నిన్న అర్థరాత్రి ముంబై పోలీసులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసిన అగంతకులు పోలీసులను అర్థరాత్రి వేళ ఉరుకులు పరుగులు పెట్టించారు. జనసామర్థ్యం వున్న ప్రాంతాలతో పాటు అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద కూడా బాంబు పెట్టామనడంతో పోలీసులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
అయితే, పోలీసల తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఏదీ గుర్తించలేదు. గుర్తు తెలియని దుండగులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు జుహులోని అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు పెట్టినట్లు కాల్ వచ్చిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు సిబ్బందితో పాటు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయా ప్రదేశాలకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టి ఏవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ ఆకతాయిల పనిగా అనుమానించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more