ఎంతటి నేర ప్రవృత్తికి చెందిన వారైనా ఒకానోక దశకు చేరుకున్న తరువాత సంఘంలో గౌరవమర్యాదల కోసం వెంపర్లాడటం సహజం. అప్పటివరకు తాము చేసిన నేరాలన్నింటినీ మానేసి.. కుదురుగా వ్యాపారం చేసుకుంటూ వ్యాపారవేత్తలుగా బిల్డప్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అప్పనంగా వచ్చిన డబ్బుతో విలాసాలకు ఎడబడటంతో పాటు ఏకంగా సంఘంలోని పెద్దల దృష్టినే ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీరు చేసిన పాపల చిట్టా ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు.. అప్పుడు కటకటాలు లెక్కపెట్టకా తప్పదన్ని విషయాన్ని మాత్రం వీరు మర్చిపోయారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే ఉప్పల్ పరిధిలోని మేడిపల్లిలో చోటుచేసుకుంది, మేడిపల్లి పరిధిలో ఇవాళ ఒక హోటల్ ఘన్నంగా ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఈ హోటల్ ప్రారంభోత్సవారిని ఎమ్మెల్యే కూడా వచ్చారు. అనుకోని కారణం చేత హోటల్ యజమాని రాలేదు. అతనే కాదు అతనితో నిత్యం ఉండే నలుగురు మిత్రులు కూడా కనిపించలేదు. ఎక్కువ సేపు హోటల్ వద్ద నిరీక్షించడం బాగోదని తెలిసిన ఎమ్మెల్యే.. హోటల్ ఓనర్ గురించి ఆరా తీశాడు. దీంతో వారిని పోలీసులు సరిగ్గా క్రితం రోజు అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
హోటల్ యజమానులను ఎందుకు అరెస్టు చేశారు.. పాపం ఇవాళ వారి హోటల్ ప్రారంభోత్సవం కూడా వుంది.. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటీ.. అంటూ ఎమ్మెల్చే పోలీసులను ఆరా తీయగా.. వారు హోటల్ యజమానులు మాత్రమే కాదని, మీ నియోజకవర్గ మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలను తస్కరించిన దొంగల ముఠా అని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్యే విస్తుపోయాడు. ఔరా పెద్దమనుషుల్లా నటించిన వీరు.. అసలు ప్రవృత్తి చైన్ స్నాచింగ్ గా అని తెలుసుకుని ఆయన షాక్ అయ్యారు. ఇక చేసేదేం లేక హుటాహుటిన హోటల్ సమీపం నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నారు.
ఇక ఎమ్మెల్యేతో మేడిపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వీరు సాధారణమైన చైన్ స్నాచర్స్ కాదు.. ఏకంగా 36 చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డ అంతర్ రాష్ట్ర దోంగల ముఠా. రెండు తెలుగురాష్ట్రాల్లోని వీరు చైన్ స్నాచింగ్ల్ లకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా దోంగతనాలకు పాల్పడినా వీరు పట్టుబడలేదు. కానీ రాచకోండలో వీరి అటలను పోలీసులు కట్టించారు. మేడిపల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని గత కొంతకాలంటా చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరుగుతున్నాయన్న పిర్యాదులతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో వీరి భాగోతం బట్టభయలైంది.
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి అర్బన్, నెల్లూరు, విజయవాడ, గుంటూర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో వీరు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ముందుగా బైక్‌లను దొంగతనం చేసి, వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడం సయ్యద్ బాషా, షేక్ అయూబ్‌లకు వెన్నతో పెట్టిన విద్య. సయ్యద్ బాషా ఎక్కడికి వెళ్లినా అక్కడి చటుక్కున వాలిపోయే అయూబ్.. బాషాను రక్షించేందుకు మరో వాహనంతో వెళ్లేవాడు. అలా ఏపీలో 32 చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు.
హైదరాబాదులోని ఉప్పల్ మేడిపల్లి ప్రాంతానికి మకాం మార్చి, నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు గొలుసు చోరీలకు పాల్పడ్డారు. అదే సమయంలో బైక్ ఒకటి పోయిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. అయితే వీరికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ షేక్ మహ్మద్ ఖలీద్ (35), వారు దొంగలించిన బంగారు ఆభరణాలను తన కారులో తరలించేవాడని, ఇతని కారుకు నాగొల్లు శశిధర్‌రెడ్డి (28) పైలట్ గా వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు. ఇక పఠాన్ జాఫర్‌ఖాన్ (38) బంగారు ఆభరణాలను రూపంమార్చి విక్రయించేవాడని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more