Groom takes aashirwaad from bride at wedding ’’పెళ్లైన వెంటనే వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు’’

Groom takes aashirwaad from bride at wedding netizens applaud couple

wedding video, viral wedding video, dulha dulhan masti, groom touches bride feet, bride and groom wedding video, lovely couple, viral news, viral wedding post, trending video, wedding video viral post

In the latest trend of wedding videos, this one is special because the groom sets a perfect example of how a couple and marriage as a whole should be equal. After the bride bends over to touch her groom's feet as a part of the wedding ritual, but surprisingly refreshing. the groom stops her and in fact bends over as well to touch his bride's feet. This video can be an example of what an equal marriage can look like and how it should be.

ITEMVIDEOS: ’’పెళ్లైన వెంటనే వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు’’

Posted: 09/15/2021 12:37 PM IST
Groom takes aashirwaad from bride at wedding netizens applaud couple

పెళ్లంటే అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. ఎన్నో ఆచార వ్యవహారాల కలయికతో ఒక్కటయ్యే ఈ బంధంలో వధూవరుల నుండి వారి తల్లిదండ్రులు, బంధువుల వరకు ఎవరి ప్రాధాన్యత వారికి ఇమిడి ఉంటుంది. అయితే.. వివాహాల వ్యవహరాల్లోనూ గాంధర్వ వివాహాలు.. స్వయంవరాలు వచ్చేసినట్టుగానే.. మారుతున్న కాలంతో పాటు యువతలోనూ ఇష్టాఇష్టాలు కూడా మారుతూ ప్రేమ వివాహాలు అధికంగా తెరపైకి వస్తున్నాయి. గుడిలో పెళ్లిళ్లు, ఆర్యసమాజ్ పెళ్లిళ్లు, రిజిస్టర్ మ్యారేజీలు ఇలా అనేక విధాలుగా.. జరుగుతున్నాయి. పదహారు రోజుల పెళ్లిళ్లు పోయి.. మూడు రోజులు పెళ్లిళ్లు రాగా, ఇక వాటి స్థానంలో ఒక్క రోజు పెళ్లిళ్లు, ఆ తరువాత గంట వ్యవధిలో పెళ్లిళ్లు. ఇక ఇప్పడు తాజాగా అన్ లైన్ పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి.

కాలక్రమేణా ఎన్ని మార్పులు, చేర్పులు జరిగినా వివాహ వేడుకల్లో నూతనంగా ఒక్కటైన జంట పెద్దల కాళ్లకు, వధువు వరుడి కాళ్లకు నమస్కారం పెట్టడం మాత్రం అన్నది కూడా అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. కానీ.. ఓ జంట మాత్రం ఏకంగా ఆచార, సంప్రదాయాన్ని పూర్తి భిన్నంగా మార్చేశారు. సహజంగా భారతీయ సాంప్రదాయ సాంప్రదాయ వివాహాలలో వధువు వరుడి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే, ఓ జంట ఇందుకు భిన్నంగా వరుడు వధువు కాళ్ళకి మొక్కితే వధువు ఆశీర్వదించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుడు చేసిన ఆలోచనతో వధువుతో పాటు నెటిజన్ల మనసును దోచుకున్నాడు.

పెళ్లి వేడుక అనంతరం.. వధువు ఆశీర్వాదం తీసుకోవడానికి వరుడి కాళ్ల మీద పడుతుండగా.. వెంటనే ఆ వరుడు ఆమెను అడ్డుకొని.. అవసరం లేదులే అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. అంతటితో ఆగని వరుడు.. వధువు కాళ్లకు నమస్కారం పెట్టాడు. దీంతో ఒక్క‌సారిగా ఆ వధువు షాక్ అయ్యి వెంట‌నే త‌న కాళ్ల‌ను వెన‌క్కి జ‌రుపుకుంటుంది. కానీ అతను మాత్రం ఆమె కాళ్ళకి నమస్కరించాడు. దీంతో ఆమె మనసును గెలుచుకోడమే కాదు.. ఈ వీడియోతో నెటిజన్ల మనసును కూడా గెలుచుకున్నాడు. భార్యభర్తలంటే ఇద్దరు సమానంగా భావించి ఆమె తన కాళ్ల మీద పడినప్పుడు తాను అలా చేస్తే తప్పేంటి అని ఇలా చేసినట్లు నెటిజన్లు వివరిస్తుండగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడి చేసిన పనికి ఫిదా అవుతున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by Piyush Awchar (@mr_robin_hudd)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles