ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ మ్యాచులకు ఉన్నంత క్రేజ్ మరే క్రీడకు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మ్యాచుల్లో అభిమానులు అవసరమైతే తమ జట్టు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అభిమానులే కాదు.. క్రీడాకారులు కూడా మ్యాచుల్లో గెలుపు కోసం ఎంతో కసిగా అడతారంటే.. మ్యాచ్ లో ఉన్నంతవరకు ప్రత్యర్థి జట్టులో ప్రాణస్నేహితుడు వున్నా.. వారిని శత్రువులుగానే పరిగణించేంతగా అడతారు. అయితే ఇలాంటి ఫుట్ బాల్ మ్యాచు లో రెండు జట్లు ఎంతో ఉత్కంఠగా ఆడుతుండగా, అభిమానులు కూడా తమ జట్టు గెలుపుకు కాంక్షిస్తూ ఉత్సాహంగా కేరింతలు, అరుపులు, కేకలు వేస్తున్నారు.
ఇలా ఉత్కంఠగా కొనసాగుతున్న మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ ఘటన అక్కడి అభిమానులందరినీ ఒక్కటి చేసింది. అప్పటి వరకు తమ తమ జట్లకు మద్దతు పలికిన అభిమానులు.. ఈ ఘటనలో మాత్రం అంతా ఒక్కటై.. ఒకే తపన.. ఒకే ప్రార్థన చేశారు. అది విజయం కావడంతో అంతా ఒక్కటై కేరింతలు కోట్టారు. తమ సంతోషాన్ని గట్టిగా వ్యక్తం చేశారు. అయ్యో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠలో ఇక అంతా ముగిసిపోయిందని అనుకుంటూ ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఒక్కసారిగా విజయం తమదైనప్పుడు ఎంతటి జోష్ వ్యక్తం అవుతుందో అలాంటి జోష్ ఇక్కడి అభిమానుల్లో వ్యక్తం అయ్యింది. అసలు ఇంతలా ఏంజరిగిందని అంటారా..
మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే.. అమెరికాలోని మియామీలో హార్డ్ రాక్ స్టేడియం ఉంది. ఇక్కడ శనివారం నాడు ఒక కాలేజ్ స్థాయి ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఇది చూడటం కోసం క్రెగ్ క్రామర్, కింబర్లీ క్రామర్ అనే దంపతులు కూడా వెళ్లారు. వారితోపాటు అమెరికా జెండా కూడా తీసుకెళ్లారు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా తలెత్తి పైకి చూసిన వారికి.. బాల్కనీ నుంచి కింద పడుతున్న ఒక పిల్లి కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన ఈ దంపతులు.. పిల్లిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. తమ చేతిలోని జెండాను పిల్లి కింద పడే ప్రదేశంలో వలలా పట్టుకున్నారు.
వీరి చర్యలను గమనించిన చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులు కూడా వారికి సాయం చేశారు. ఎలాగైనా పట్టు చిక్కించుకొని పైకి ఎక్కడం కోసం ప్రయత్నించిన పిల్లి.. చివరకు జారి కింద పడింది. ఆ సమయంలో కింద అమెరికా జెండాను జల్లెడలా పట్టుకోవడంతో అది బతికిపోయింది. పిల్లికి ఎటువంటి గాయాలూ కాలేదు. ఈ మొత్తం ఘటనను కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే దీన్ని 70 లక్షలమందికిపైగా చూశారు. నెటిజన్లు స్టేడియంలో ప్రేక్షకులు చేసిన పనిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
CAT SURVIVES FALL AT HARD ROCK STADIUM!!!! #SaveTheCat pic.twitter.com/oPNGgfUltZ
— Yianni Laros (@Yiannithemvp) September 11, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more