దిగ్గజ ఈ కామర్స్ సంస్థల మధ్య కూడా పోటీ వాతావరణం నెలకోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో అటు ఫ్లిప్ కార్ట్ ఇటు అమెజాన్ ల మధ్య అమ్మకాల విషయంలో గత కొన్నేళ్లుగా పోటీ కోనసాగుతూనే వుంది. వచ్చేనెల నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021కు రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 4 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. త్వరలో రాబోయే దసరా, దీపావళి పండుగల సందర్భంగా.. ఈ సేల్‌ను అమెజాన్ ప్రారంభిస్తోంది. అక్టోబర్ 7 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవనున్న నేపథ్యంలో.. దాని కంటే మూడు రోజుల ముందే.. అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది.
ఈ సేల్ నెల రోజుల పాటు కొనసాగనుంది. ప్రతి రోజు పలు వస్తువుల మీద భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అమెజాన్.. ఈ సేల్ లో అందించనుంది. ప్రముఖ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీస్, స్మార్ట్ వాచ్, టాబ్లెట్, లాప్టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, స్మార్ట్ టీవీ, ఇతర హోమ్ అప్లయెన్సెస్ మీద అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. వీటితో పాటు.. ఇకో, ఫైర్ టీవీ, కిండిల్ లాంటి డివైజ్‌లు కూడా తక్కువ ధరకే లభించనున్నాయి. అలెక్సా డివైజ్ మీద కూడా అమెజాన్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో 1000 కి పైగా సరికొత్త ప్రొడక్ట్స్ విడుదల కానున్నాయి.
యాపిల్, అసుస్, ఫోసిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, సామ్సంగ్, సోనీ, జియోమీ బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్ విడుదల కానున్నాయి. సోనీ పీఎస్5, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ కూడా ఈ సేల్‌లో రిలీజ్ అవనున్నట్టు తెలుస్తోంది. మెజాన్ పే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు ముందే యాక్సెస్ ఉంటుంది. అలాగే.. వాళ్లకు అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, అదనపు వారంటీలు లభించనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more