Mystery behind woman dead body at lake మహిళ మృతదేహం.. వాళ్లు చెప్పింది నిజమే.!

Mystery behind nude woman dead body at bhatula cheruvu

woman deadbody, Bhatula cheruvu, love marriage, wife, ill health, Hayath nagar, Hyderabad, Rachakonda Police, Telangana, Crime

A man, who allegedly did not have money to perform the last rites of his dead wife, carried her body on a bike with the help of a friend to bury her near a lake at Thorrur in Hayathnagar.

మహిళ మృతదేహం.. ఆ యువకులు చెప్పింది నిజమే.!

Posted: 09/25/2021 12:33 PM IST
Mystery behind nude woman dead body at bhatula cheruvu

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో బాతుల చెరువు సమీపంలో ఇద్ద‌రు యువ‌కులు ఓ యువ‌తి మృత‌దేహాన్ని దుప్పట్లో చుట్టుకుని బైక్ పై తీసుకువచ్చి చెరువలో పడేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని వారు ఖననం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. చెరువులో పడేవేసేందుకు వచ్చారని అనుమానం వచ్చిన స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటనలో మిస్టరీ వీడింది. అయితే పోలీసుల దర్యాప్తులో పట్టుబడిన ఇద్దరు యువకులు నిజాన్నే చెప్పారని తేలింది. ఇక పోస్టుమార్టం రిపోర్టు కూడా అదే విషయాన్ని దృవీకరించింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఇద్దరిలో ఓ యువకుడు చెప్పినట్టుగా మృతురాలు బాధితుడి భార్యేనని, అనారోగ్యంతో చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేక చెరువుకట్టపై ఖననం చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె అనారోగ్యంతోనే మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం ఈనకల్లుకు చెందిన డేగ శ్రీను మేస్త్రీగా పనిచేస్తున్నాడు. భవన నిర్మాన కార్మికులరాలిగా పనిచేస్తున్న, కర్ణాటకకు చెందిన లక్ష్మి (30)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవనం కూడా సాఫీగానే సాగుతూ ఓ పాప, బాబు ఉన్నారు.

అయితే కరోనా మహమ్మారి విజృంభనతో వీరి పరిస్థితులు పూర్తిగా మారాయి. చేతిలో డబ్బులు లేకపోవడం. పనులు కూడా లభించకపోవడం.. అదే సమయంలోఇద్దరు చిన్నారుల గురించి అలోచించిన వీరు.. ఆరునెలల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు. హయత్ నగర్ లో ఓ బస్తీలో నివసిస్తూ.. స్థానికంగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే ఉన్నట్టుండి లక్ష్మి ఇటీవల అనారోగ్యం పాలవడంతో ఇంటి వద్దే ఉంటోంది. గురువారం రోజులానే పనికి వెళ్లిన శ్రీను సాయంత్రం ఇంటికొచ్చేసరికి భార్య లక్ష్మి తీవ్ర అస్వస్థతతో అల్లాడిపోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె మరణించింది.

అమె మరణంతో దిగ్బ్రాంతికి గురైన భర్త శ్రీను.. అమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో స్థానికంగా ఉండే బాతుల చెరువు వద్ద ఖననం చేయాలని నిర్ణయించాడు. అయితే లక్ష్మీ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టిన శ్రీను తన స్నేహితుడి సాయంతో చెరువు వద్దకు మోసుకెళ్లాడు. కాగా చెరువులో అమె మృతదేహాన్ని పడేసేందుకు యత్నిస్తున్నారన్న అనుమానాంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించగా అనారోగ్యంతోనే లక్ష్మి మరణంచినట్టు వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles