పంటలు పండించే రైతు లాభాఫేక్ష కోసం కాకుండా నేలతల్లి బిడ్డగా పంటలను పండిస్తూనే వుంటాడు. అయితే అతనికి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్నే ఆశిస్తాడు తప్ప.. లాభాలు కోరుకోడు. అది రైతన్న గొప్పదనం. ఆ గొప్పదనాన్ని మెచ్చిన శాస్త్రవేత్తలు వారికి ప్రతిఫలం అందేలా పాటుపడుతున్నారు. అనునిత్యం ఏదో ఓ ప్రయోగాన్ని విజయం చేస్తూ సరికొత్త వంగడాలను, హైబ్రీడ్ రకాలను పండిస్తున్నారు. దీంతో రైతుల కడుపు నింపుతున్నారు. ఈ క్రమంలో వారు పండించిన పంటలు నాణ్యత, రుచి, ఫోషకాలు అన్ని సమపాళ్లో వుండేలా చూసుకుంటున్నారు.
అటువంటి పంటల్లో రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది ‘గింజలు లేని పుచ్చ పంట’. అదేంటి పుచ్చపండు అంటేనే గింజలు.. అలాంటిది గింజలు లేకుండా అంటే.. ఇక పిల్లలు ఎంచక్కా లోట్టలేసుకుని తినేస్తారు అంటారా. ఔను నిజమే. మరి ఈ తరహా పుచ్చపండును ఎవరు అభివృద్ది చేశారు అంటే.. కేరళ అగ్రికల్చర్ వర్శిటీ. కేరళలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం గింజలు లేని పుచ్చపండు హైబ్రీడ్ వంగడాలు రూపొందించింది. అయితే ఒక్కటి మాత్రమే కాదు ఏకంగా రెండు హైబ్రీడ్ వంగడాలను అభివృద్ది చేసింది.
వీటికి షోనిమా, స్వర్ణగా పేరుతో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
కేరళలోని త్రిచూర్ ప్రాంతంలోని వెల్లినక్కర సమీపంలో కొత్తగా నిర్మించిన పాలిహౌస్లో కేరళ ఉద్యాన శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సీడ్ లెస్ పుచ్చను సాగుచేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఈ పుచ్చరకాన్ని పాలి హౌసులో మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిన పెంచారు. బిందు సేద్యంతో యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేసి చక్కటి ఫలితాలను కూడా సాధించారు. ఆ తరువాత ఆ ఫలాలు రైతులకు దక్కేలా మార్కెట్ లో ప్రదర్శనలో పెట్టారు. ఈ గింజలు లేని పుచ్చ పంట గురించి అగ్రికల్చర్ సైంటిస్టు డాక్టర్ టి.ప్రదీప్ కుమార్ మాట్లాడుతు..గింజలు లేని పుచ్చ అనేది అసాధారణ హైబ్రీడ్ విత్తనం అని తెలిపారు. ఇది రైతులకు లాభాలను అందిస్తుందన్నారు.
ఈ సీడ్లెస్ పుచ్చ పంట సాగుకు ఎకరానికి రూ.50 వేల పెట్టుబడి పెట్టాలని.. అయితే ఎకరానికి రూ.1.2 లక్షల వరకు ఆదారం తెచ్చిపెడుతుంది. కేరళ అగ్రి వర్సిటీలోఒక్కో గింజను రూపాయి చొప్పున అమ్మకానికి పెట్టారు. కిలోకి 30వేల గింజలు వస్తాయన్నారు. ఈ గింజలు లేని పుచ్చ పంటపై త్రిచూరు జిల్లా రైతులు మంచి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే గింజలు కొని పంటలు వేశారు. చక్కటి లాభాలు పొందారు. సీడ్లెస్ పుచ్చ సాగు చేసి లక్షలు గడించినట్లు చెబుతున్నారు. తాము పండించిన పంటను వీడియోలు తీసి వాటిని పలు వెబ్సైట్లలో పెడుతున్నారు రైతులు. మీరు కూడా పండించి లాభాలు పొందండీ అని సూచిస్తున్నారు.కాగా ఈ పంట ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more