అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మరోమారు రాజకీయాల్లోకి తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాజకీయాలపై ఆధారపడి జీవనం సాగించే కోవకు చెందని అమె రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిగా ప్రజలు సేవ చేసిన ఆమె.. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ, అంకితభావంతో పని చేయడానికి వీలువుతుందని రాజకీయ అరంగ్రేటం చేయాలని భావించారు. అప్పటికే రాష్ట్రంలో వేళ్లూనుకున్న రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలలో టికెట్ల కోసం ఆ పార్టీ నేతలే పోటీపడుతున్న నేపథ్యంలో తనకు సేవ చేసే అవకాశం, చట్టసభలకు పోటీ చేసే చాన్స్ లభించక పోవచ్చునని అలోచనతో కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు.
అరకు పార్లమెంటరీ సభ్యురాలిగా తాను చేసిన పని తనకు అత్యంత సంతృప్తిని అందించిందని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న పార్లమెంటు సభ్యులలో లోక్ సభకు అత్యధిక హాజరైన కొందరు ఎంపీలలో తాను ఒకరినని, అంతేకాకుండా పార్లమెంటులో అధిక ప్రశ్నలు అడిగిన ఎంపీగా కూడా తనకు గుర్తింపు వచ్చిందని అన్నారు. దీనికి తోడు అరకు లోయలో పర్యాటకులకు ఒక గ్లాస్ బోగిని తీసుకురావడంతో పాటు రోడ్డు, మౌళికవసతుల కల్పన నిధులు, గిరిజన సంక్షమ నిధులు తీసుకురావడం, సబ్ ప్లాన్ నిధులు సమకూర్చుకోవడం సహా అన్నింటా విశేషంగా కృషి చేశానని అన్నారు.
అయితే జనజాగృతి పార్టీని స్థాపించడం తాను చేసిన ఒక అనుభవరాహిత్య వ్యవహారంగా చెప్పుకచ్చిన కొత్తపల్లి గీత.. సహజంగా తప్పులు అందరూ చేస్తారు.. తాను ఈ తప్పు చేశానని అంగీకరించారు. అయితే ఈ తప్పుతో తాను ఓ రాజకీయ పాఠాన్ని నేర్చుకున్నానని అన్నారు. అయితే దానికి బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. తాను తన జనజాగృతి పార్టీని బీజేపి పార్టీలో విలీనం చేశానని, దీంతో కేంద్రంలోని అధికార పార్టీ నేతృత్వంలో పనిచేయడం ద్వారా ఒక మంచి ఎక్స్ ఫోజర్ వుంటుందని అమె భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పార్టీని తాను ఆగస్టు 2018లోనే పార్టీని స్థాపించానని అన్నారు. అయితే పార్టీ స్థాపించేందుకు అసలు కారణమేంటీ.? అన్న వివరాలను కూడా తెలిపారు.
ఒక మహిళగా అరకు లాంటి నియోజకవర్గాన్ని ఇంతలా కష్టపడిన తాను.. అనేక ప్రజాసమస్యలను పరిష్కరించానని.. అయితే అది తన లోక్ సభ స్థానం వరకు మాత్రమే పరిమితం అవుతోందని అన్నారు. అయితే రాష్ట్రం మొత్తంమీద కూడా అనేక రకాలైన సస్యలు వున్నాయి, వాటిని కూడా తన తరహా అలోచనలు వున్నవాళ్లు నిబద్దతతో, అంకితభావంతో పనిచేస్తే కలిస్తే మార్పు సాధ్యమవుతుందని తాను నమ్మానని అన్నారు. కాగా పార్టీ పెట్టి ప్రజాసమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యం ఉండే సరిపోదని, దానికి చాలా కారకాలు కూడా అనుకూలించాలని అనుభవపూర్వకంగా తాను తెలుసుకున్నానని చెప్పారు.
ఇక పార్టీ పెట్టాలన్న మంచి ఉద్దేశ్యం వుంటే సరిపోదని, అదే ఉద్దేశ్యం ప్రజల్లో కూడా వుండాలని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 90 శాతం మంది రాజకీయ నాయకులు రాజకీయాలను డబ్బు అర్జించే మార్గంగా, వ్యాపారంగానే అలోచిస్తున్నారని లేదంటే ఎన్నికల ద్వారా తమకు పేరు ప్రతిష్టలు రావాలని అలోచించేవారు ఎక్కువని అన్నారు. అయితే నిజంగా ప్రజాసేవ చేయాలి అని నిస్వార్థంగా ముందుకువచ్చేవారు చాలా తక్కువ సంఖ్యలో వున్నారని అన్నారు. అయితే వారు అర్థికంగా పటిష్టంగా లేరని అన్నారు. కాగా భారీ డబ్బు ఉన్నవారు మాత్రమే రాజకీయాల్లో నెగ్గుతున్నారని అన్నారామె. ఇక తన నియోజకవర్గమైన అరుకులో ప్రజలు తమ గ్రామ సమస్యలపై తనను అడిగారే తప్ప, ఎవ్వరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడిగినవారు లేరని అమె అరుకు ప్రజల నిస్వార్థకతను శ్లాఘించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more