నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ థెరిస్సాపై మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజలను రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేసిన మైసూరు పార్లమెంటు సభ్యుడు ప్రతాస్ సింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య శాంతి సామరస్యతకు విఘాతం కలిగిస్తూ.. రెచ్చగోట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు, ఈ మేరకు కాంగ్రెస్ నేతలు మైసూరు డిఫ్యూటీ కమీషనర్ తమ పిర్యాదును అందజేశారు. తమ అరోపణలను ఖండించలేనివారిపై నోరుజారడం బీజేపి నేతలకు అలవాటుగా మారిందని వారు దయ్యబట్టారు.
నంజన్గూడ్ తాలూకా మానేరులోని అగ్రహారంలో ఇటీవల అధికారులు కూల్చివేసిన శతగణపతి దేవాలయాన్ని కూల్చడంతో అక్కడకు చేరుకున్న ఎంపీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడి అనుగ్రహం వుండటం వల్లే తామకు ఐదు గుంటల భూమి లభ్యమైందని, తాము అక్కడ గణపతి దేవాలయాన్ని నిర్మిస్తామని అన్నారు. ఇక దేవాలయాల కూల్చివేతలు జరగకుండా రక్షణ చట్టం అందుబాటులోకి రావడంకూడా గణపతి మహిమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మతమార్పుడులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు.
తాను మతమార్పిడులకు వ్యతిరేకమని, కానీ బీషన్ లు మాత్రం మతమార్పుడుల వ్యతిరేక చట్టాన్ని చూసి భయపడుతున్నారని ఆయన విమర్శించారు. మతమార్పిడి బిల్లును పార్లమెంటులో పాస్ అమోదం పొందితే తమ ఆటలు సాగవని వారికి తెలిసి బిక్కముఖాలు వేసుకున్నపిల్లుల మాదిరిగా చూస్తున్నారని అరోపించారు. మీరు మత మార్పిడులకు పాల్పడకపోతే బిల్లు పాసైనా అభ్యంతరం ఎందుకని అన్నారు. రుషులు, మహర్షులు కావాలంటే హిందూమతంలో ఎన్నో గొప్ప పనులు చేయాల్సి ఉంటుందని, కానీ క్రైస్తవంలో సెయింట్ హోదా పొందాలంటే అవేం అక్కర్లేదని, మేజిక్కులు, గిమ్మిక్కులు చేస్తే సరిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
మైసూరులో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళ కడుపులోని కేన్సర్ గడ్డను కరిగించడమనే అద్భుతమైన మేజిక్ చేసిన మదర్ థెరిస్సాకు సెయింట్ హోదా లభించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రైస్తవ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మదర్ థెరిస్సాపై నోరు పారేసుకున్నందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగోట్టి ఎన్నికల్లో లభ్ది పోందాలని బీజేపి నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more