CRPF Jawans Injured In Landmine Blast In Chhattisgarh ల్యాండ్ మైన్ పేల్చిన మావోలు.. ఇద్దరు జవాన్లకు గాయాలు..

Two crpf personnel injured in ied blast in naxal hit bijapur

CRPF, jawans injured maoists attack, CRPF personnel injured, IED blast, Naxal-hit Bijapur, Halbapada village, Modakpal police station, Bijapur district hospital, Bal Kishan, Sonidul Islam, Bijapur SP Komal Lochan Kashyap, Dharmagarh, Pamed police station, Chhattisgarh, Crime

Two CRPF jawans were seriously injured in a landmine blast by Maoists at Bijapur district bordering Chhattisgarh. The blast took place near Halbapada village under Modakpal police station, stated reports. The injured were taken to Bijapur district hospital. They have been identified as Bal Kishan and Sonidul Islam, said Bijapur SP Komal Lochan Kashyap.

ఛత్తీస్ గడ్ ల్యాండ్ మైన్ పేల్చిన మావోలు.. ఇద్దరు జవాన్లకు గాయాలు..

Posted: 09/30/2021 03:54 PM IST
Two crpf personnel injured in ied blast in naxal hit bijapur

ఛ‌త్తీస్ గ‌ఢ్‌లోని మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ పోలీసు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. గురువారం ఉద‌యం బీజాపూర్ కు స‌మీపంలోని హాల్బపాడ గ్రామ సమీపంలో మావోయిస్టులు మందుపాత‌ర పేల్చారు. దట్టమైన అటవీ ప్రాంత పరిధిలోని ముర్కినార్, చిన్నెకేడ్ పాల్ క్యాంపుల పరిధిలో మోదక్ పాల్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటనకు మావోలు పాల్పడ్డారని సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

సీఆర్ఫీఎప్ 170 బటాలియన్ కు చెందిన పోలీసు బలగాలు రోడ్డు సెక్యూరిటీ అపరేషన్స్ ను తనిఖీ చేస్తున్న తరుణంలో మావోయిస్టులు ఈ దశ్చర్యకు పాల్పడ్డారని బిజాపూర్ ఎస్పీ కోమల్ లోచన్ కశ్యప్ తెలిపారు. సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాత‌ర‌ను పేల్చ‌డంతో.. సన్నిద్దుల్ ఇస్లామ్, కె. బాలకృష్ణ అనే ఇద్ద‌రు పోలీసుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన బీజాపూర్ జిల్లా అసుపత్రికి తరలించారు. కాగా ఇరువురికీ కాళ్లకు గాయాలయ్యాయని, అయితే వారి అరోగ్య పరిస్థితి కూడా నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో అప్ర‌మ‌త్త‌మైన బెటాలియ‌న్.. ఆ ఏరియాలో కూంబింగ్ చేప‌ట్టింది. గాయ‌ప‌డ్డ పోలీసుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles