చిరుత, పెద్దపులి, సింహం, ఇలాంటి క్రూరమృగాలనే కాదు ఏనుగు, ఎలుగుబంటి వంటి వన్య మృగాలను జంతు ప్రదర్శన శాలలకు వెళ్లి కాసింత దగ్గరగా చూడాలంటేనే ప్రాణాల్లో అరచేతిలో పెట్టుకుంటాం. అలాంటిది వాటికి ఎదురుపడ్డామా.? తప్పించుకునే తరుణోపాయం కోసం అలోచించేలోపే.. అవి దాడి చేసేస్తాయి. అయితే కొందరు మాత్రం తమ ధైర్య సాహసాలతో ఎంతటి క్రూరమృగాలనైనా ఎదురిస్తుంటారు. విజయమో.. విర స్వర్గమో అని తెల్చుకునేందుకు బరిలో దిగుతారు. క్రూర మృగాలైనా.. పలాయనం చిత్తగించాల్సిందే తప్ప వీరు మాత్రం ఓటమిని అంత సులువుగా అంగీకరించరు.
కొందరు మాత్రం వాటి బారి నుంచి బతుకు జీవుడా..అని బయటపడి ప్రాణాలు కాపాడుకుంటారు. ఇటీవల మహారాష్ట్రలో.. కుటుంబంతో సహా వస్తున్న వ్యక్తిపై చిరుత దాడి చేయగా, దానితో పోరాడి చంపేసిన వీరుడి గురించి తెలుసుకున్నాం. ఇక ఆ తరువాత తన గొర్రెల మందపై దాడికి యత్నించిన చిరుతతో పోరాడిన ఓ పశువుల కాపరి గురించి తెలుసుకున్నాం. అయితే ఆకాశంలో సగం అంటున్న మహిళలు ఇలాంటి సాహసాలు చేయగలరా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాగా, మధ్య వయస్సులోని మహిళ కూడా తన వాకింగ్ స్టిక్ తో చిరుతను కుక్కను తరిమినట్టుగా తరమడం చూస్తూ.. వావ్ అంటూ అమె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.
ముంబైలోని అరే కాలనీలో తమ ఇంటి అరుబయట కూర్చొన్న ఓ మహిళపైకి దాడి చేసేందుకు చిరుత యత్నించింది. వాకింగ్ స్టిక్ తో దానితో పోరాడింది. దీనికి సంబంధించిన విజువల్స్ సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పోస్టు కావడంతో వైరల్ అయ్యాయి. ఆమె ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఆరే కాలనీలో సాయంకాల సమయంలో ఓ మధ్యవయస్సురాలైన మహిళ ఆరుబయట కూర్చొని ఉంది. అయిత నడవడానికి ఇబ్బందిపడే అమె తన వాకింగ్ స్టిక్ తో వచ్చి దానిని పక్కనే పెట్టుకుని ఉంది.
అలా వచ్చి కూర్చోందో లేదో అమె ఏదో అలోచిస్తోంది. అయితే ఈమె వెనుకాలే నక్కి అహారం కోసం వెతుకుతున్న చిరుతను ఆమె గమనించలేదు. దీంతో ఎలాంటి అలికిడి చేయకుండా మెల్లిమెల్లిగా ముందుకు నడుచుకుంటూ వచ్చిన చిరుత ఒక్కసారిగా ఆమెపై దాడికి పాల్పడింది. తొలుత ఏదో కుక్క అనుకున్న అమె చేయెత్తి కోట్టబోయింది. తీరా దానిని చూసిన తరువాత చిరుత అని గ్రహించగానే భయపడిపోయి..కేకలు వేసింది. దీంతో అమెపై పంజాతో విరుచుకుపడిన చిరుత అమెను కిందపడేసింది. దీంతో తన వాకింగ్ స్టిక్ ను అందుకున్న మహిళ.. చిరుతపై తన వాకింగ్ స్టిక్ తో తిరగబడింది. అంతే చిరుత ముఖంపై దెబ్బ తగలడంతోనే అది కాస్త వెనక్కు తగ్గింది.
ఆమె కేకలు విని ఇంట్లో వున్న తన కొడుకులతో పాటు స్థానికులు రావడంతో చిరుత పారిపోయింది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. అరునీల్ సాదదేకర్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈమె 55 ఏళ్ల నిర్మలాదేవిగా గుర్తించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం..ఇంటి బయట ఆడుకుంటున్న…నాలుగేళ్ల చిన్నారిపై చిరుత దాడికి పాల్పడింది. బాలుడిని లాగడానికి ప్రయత్నించగా..స్థానికులు రావడంతో..చిరుత పారిపోయింది.
CCTV visuals of a leopard attack in Aarey colony..
— Aruneel Sadadekar (@Aruneel_S) September 30, 2021
A senior citizen woman braves off a sudden leopard attack in #Mumbai's #Aarey Colony...
Woman suffers injuries...#Leopard attacks have become frequent in Aarey Colony...few days back, a four year old boy was also attacked pic.twitter.com/Mk8xOecJst
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more