Uttarakhand minister Yashpal Arya join Congress with MLA son దేవభూమిలో కషాయ పార్టీకి షాక్.. సొంతగూటికి యశ్ పాల్

Uttarakhand minister yashpal arya join congress after quitting bjp along with mla son

Operation Lotus, Yashpal Arya, Sanjiv Arya, BJP, Transport Minister, Congress, Rahul Gandhi, KC Venugopal, Harish Rawat, Uttarakhand, Politics

Uttarakhand Transport Minister Yashpal Arya and his son Sanjiv Arya have resigned from the BJP and joined the Congress party in New Delhi. The former BJP leaders were inducted into the party in the presence of senior party leader Harish Rawat and AICC General Secretary KC Venugopal.

దేవభూమిలో కషాయ పార్టీకి షాక్.. సొంతగూటికి యశ్ పాల్

Posted: 10/11/2021 04:05 PM IST
Uttarakhand minister yashpal arya join congress after quitting bjp along with mla son

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అపరేషన్ కమలం అకర్షించగా, ఇప్పుడు తాజాగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి యశ్‌పాల్‌ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్‌ ఆర్యతో కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఏకంగా రాష్ట్ర మంత్రి యష్‌పాల్ ఆర్య బీజేపీని వీడడం.. కాషాయ పార్టీకి, పార్టీ పెద్దలకు భారీ షాక్ తగిలింది. దేవభూమిగా పేరుపొందిన ఉత్తరాఖండ్ లో మరికొన్ని నెలల వ్యవధిలో జరగనున్న ఎన్నికలలో వార్ వన్ సైడ్ అని బీజేపీ నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

కాగా వార్ అటే కాదు ఇటు కూడా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ కూడా అస్త్రశస్త్రాలు సన్నధం చేస్తోంది. ఇక అధికార బీజేి ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు సీఎంలను మార్చిన తర్వాత పార్టీలో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామితో మంత్రులకు పడటంలేదు. కొందరు విమర్శలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన సీనియర్ బీజేపీ నాయకుడు మరియు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి యష్‌పాల్ ఆర్య మాత్రం ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పారు. తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అదే సమయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మరియు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ సమక్షంలో యష్‌పాల్ ఆర్య కాంగ్రెస్ లో చేరారు. యష్ పాల్ తో పాటు ఆయ కుమారుడు సంజీవ్ కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరికకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన నివాసంలో వీరు కలిశారు. యష్‌పాల్ ఆర్య 2017 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2002-2007 మధ్యకాలంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 2007 నుంచి 2014దాకా ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. మోదీ హవాలో కాంగ్రెస్ బలహీనపడటంతో 2017లో బీజేపీలో చేరిన యష్‌పాల్ ఆర్య.. మళ్లీ ఇప్పుడు సొంత గూటికి చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles