ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులు డెలివరీ జరిగే సమయంలో ఉత్కంఠతతో అనాలోచితంగా వాటిని తెరిచేకన్నా.. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. మనం అర్డర్ ఇచ్చిన వస్తువే వచ్చిందా.? లేక మరోకటి వచ్చిందా.? అని తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. చటుక్కున ఓటిపి చెప్పిసి.. డెలివరిని అందుకుని ఇంట్లో లోనికి వెళ్లి ఓపెన్ చేయాలని చూస్తే.. ఖరీదైన వస్తువులు రాక.. భారీ మొత్తంలోని మీ సోమ్ము కూడా చేజారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని చాటి చెప్పే సంఘటన ఇది. ఇప్పటికే ఆన్ లైన్ లో చేసిన ఆర్డర్ కు బదులుగా వేరే అర్డర్లు వచ్చిన సందర్భాలు అనేకం.
ఇది కంపెనీ వారి తప్పిదమే అయినా.. జాగ్రత్తగా వ్యవహరించకపోతే.. జరిగే నష్టం మీకే అన్న విషయాన్ని మర్చిపోరాదు. ఇక డెలివరీలోనూ అనేక చేతులు మారే క్రమంలోనూ వస్తువులను తారుమారుచేసి.. ఏమీ ఎరగనట్టు కూడా కొందరు వ్యవహరిస్తుంటారు. ఏది జరిగినా.. నష్టాన్ని ఎదుర్కోవాల్సింది మాత్రం మీరే. అందుకనే ఖరీదైన డెలివరీలు వచ్చే సందర్భంలో అప్రమత్తత ఎంతైనా అవసరం. తాజాగా జరిగిన ఘటన ఈ కామర్స్ డెలివరీల విషయంలో ఎంత అప్రమత్తత అవసరమో అన్న విషయాన్ని చాటిచెబుతోంది. ప్లిఫ్ కార్ట్ లో ఓ యువకుడు తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
ఈ నెల 3 నుంచి ప్రారంభమైన బిగ్ బిలియన్ డే సేల్ లో గ్రేట్ డీల్ గా భావించిన యువకుడు దీని ద్వారా ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. అయితే అతనికి డెలివరీ రావడంతోనే కొంత ఉత్సాహంగానే దానిని అందుకున్నాడు. కానీ దాని బరువు చూసిన తరువాత అనుమానం కలిగింది. దీంతో డెలివరీ బాయ్ కి ఓటిపి చెప్పకుండా.. అతని సమక్షంలోనే ఆ ఫోన్ ఫ్యాక్ విప్పించాడు. అంతేకాదు.. ముందుజాగ్రత్త చర్యగా దానిని విప్పుతుండగా తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగ్ కూడా చేశాడు. దీంతో దానిని తెరవంగానే యువకుడితో పాటు డెలివరీ బాయ్ కూడా విస్తుపోయారు. ఎందుకంటే అందులో ఐ ఫోన్ కు బదులుగా రెండు నిర్మా సబ్బులు వచ్చాయి.
బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద ఓ యువకుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ యువకుడి వద్దకు రాగానే అతనికి అనుమానం వచ్చింది. ఇక ఓటీపీ చెప్పకుండానే ప్లిఫ్‌కార్ట్ డెలివరీ బాయ్ సమక్షంలోనే ఆ బాక్స్‌ను విప్పాడు. ఆ బాక్స్‌లో ఐఫోన్ 12కు బదులుగా.. రూ. 5 విలువ చేసే రెండు నిర్మా సబ్బులు ఉండటంతో షాక్‌కు గురయ్యారు. దీంతో బాధిత వ్యక్తి ప్లిఫ్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇది తమ తప్పేనని కొద్దిరోజులకు ప్లిఫ్‌కార్ట్ యాజమాన్యం అంగీకరించింది. ఇక ఆ యువకుడి డబ్బులను ప్లిఫ్‌కార్ట్ రీఫండ్ చేసింది. తన బ్యాంకు ఖాతాలో ఆ నగదు జమ అయినట్లు బాధిత యువకుడు తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more