ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మధ్య సాగిన మాటల యుద్ధం క్రమంగా రాజకీయ మలుపు తీసుకుని ముదిరి పాకానపడుతోంది. మంత్రి నవాబ్ మాలిక్ ను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి రాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నావిస్ టార్గెట్ చేశారు. నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు తమను అప్రతిష్టను అపాదించి పెడుతున్నాయని తక్షణం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫడ్నావిస్ సతీమణి కూడా మంత్రి నవాబ్ మాలిక్ పై పరువునష్టం దావాను వేసిన విషయం తెలిసిందే.
కాగా తన ఇంట్లో డ్రగ్స్ దొరికాయని దేవంద్ర ఫడ్నావిస్ చేసిన వ్యాఖ్యలపై తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో మంత్రి నవాబ్ మాలిక్ కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు వున్నాయని, ఆయన ఇంట్లో డ్రగ్స్ కూడా లభించాయని దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఫడ్నావిస్ తీవ్ర అరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను తక్షణం ఫడ్నావిస్ వెనక్కు తీసుకోకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మంత్రి మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ ఫడ్నావిస్ కు లీగల్ నోటీసులు పంపారు. దేవేంద్ర ఫడ్నవీస్ అరోపణలతో తన పరువుకు భంగం వాటిల్లిందని ఆయనపై అయిదు కోట్ల నష్టపరిహారం దావాను వేసినట్లు తెలిపారు. మాలిక్ కూతురు నీలోఫర్ మాలిక్ ఖాన్ లీగల్ నోటీసుకు చెందిన కాపీని ఇవాళ రిలీజ్ చేశారు. లాయర్ రెహ్మాత్ అన్సారీ ద్వారా ఆ నోటీసులు ఫడ్నవీస్‌కు పంపారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన సమీర్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్ కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన అతన్ని రిలీజ్ చేశారు. మంత్రి మాలిక్ అల్లుళ్లు డ్రగ్స్‌తో దొరికారని ఇటీవల ఫడ్నవీస్ ఆరోపించారు.
అయితే ఎన్సీబీ దాఖలు చేసిన చార్జీషీట్‌లో తమపై ఎటువంటి ఆరోపణలు లేవని మాలిక్ అల్లుడు తమ లీగల్ నోటీసులో తెలిపారు. జనవరి 14వ తేదీన ఇచ్చిన పంచనామా ప్రకారం తమ ఇంట్లో మాదక ద్రవ్యాలు దొరకలేదని, మీరెలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో మాలిక్ అల్లుడు ప్రశ్నించాడు. ఫడ్నవీస్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాత తమ తదుపది చర్యలు మొదలుపెడుతామని మాలిక్ కూతురు చెప్పింది. ఫడ్నవీస్ క్షమాపణలు చెప్పకుంటే, తాము నష్టపరిహారం దావాతో కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.
ఇదిలావుండగా, తన కుమారిడిపై.. మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలపై బాంబే హైకోర్టును ఆశ్రయించి.. పరువునష్టం పిటీషన్ దాఖలు చేసిన ఎస్సీబి అధికారి సమీర్ వాంఖేడ్ తండ్రి పిటీషన్ ను న్యాయస్థానం ఈ నెల 12కు వాయిదా వేసింది. అంతకుముందు ఈ పిటీషన్ పై విచారణ చేసిన న్యాయ్థానం ఓ రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఆయన చేసిన అరోపణలన్నీ వాస్తవాలని నిర్ధారించేలా అఫిడెవిట్ దాఖలు చేయాలని అదేశించింది. అయితే అది ఒక్క పేజీ ఉన్న అఫిడెవిట్ అయ్యిఉండాలని న్యాయస్థానం పేర్కోనింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more