కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలోని ట్రాఫిక్ పోలీసులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో పనిలోపనిగా హెల్మెట్ ధారణపై కూడా అవగాహన కల్పించేందుకు ఉపక్రమించారు. ఇంతవరకు బాగానే వున్నా.. అనుకోకుండా అక్కడి ఓ ఎస్ఐ ఓ వాహనదారుడిని తన కూతరు ఎదుటే చెంప చెల్లుమనిపించాడు. నిబంధనలు అతిక్రమించిన వాహనాన్ని నడుపుతున్నాడని పోలీసు ఎస్ఐ వాహనదారుడిపై దురుసగా ప్రవర్తించాడు. అంతే ఆ వ్యక్తి ఎస్ఐ వద్దకు వెళ్లి తనను కొట్టేందుకు తాను ఏం నేరం చేశానని నిలదీయడంతో అతనికి అండగా స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాలు.. శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురుతో కలిసి బైక్ మీద కూరగాయల మార్కెట్ కు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు హెల్మెట్ ధరించలేదని దబాయిస్తూ.. బైక్ తాళం తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి తాను హెల్మెట్ ధరించానని పోలీసులకు చెప్పినా పట్టించుకోకుండా ఎస్ఐ మునీరుల్లా చేయి చేసుకున్నాడని శ్రీనివాస్ తెలిపాడు. తాను ఏ తప్పుచేయలేదని హెల్మెట్ ధరించినా.. లేదని దూషించి చేయి చేసుకున్నాడని ఆరోపించాడు. ఒక వేళ హెల్మెట్ ధరించని పక్షంలో ఫైన్ వేయాల్సిందని.. తనను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనే వాహనాలను సీజ్ చేయకూడదని హైకోర్టు అదేశాలు ఇచ్చిందని, అలాంటప్పుడు.. హెల్మెట్ లేదని తన బైక్ తాళం చెవిలు తీసుకోవడమేంటని ప్రశ్నించాడు. తన బైక్ కీస్ తీసుకోవడమే కాకుండా తనపై తన కూతురి ఎదురుగానే చేయి చేసుకోవడం ఏమిటని శ్రీనివాస్ పోలీసుల స్థానిక ఉన్నతాధికారి వద్ద అన అక్రోశాన్ని వెళ్లగక్కాడు. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేయాల్సిన అధికారులు.. తానేదో నేరం చేసినట్లు ఎందుకు చేయి చేసుకున్నాడని నిరసిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీడియో ప్రకారం.. పోలీసుల ప్రవర్తనతో శ్రీనివాస్ కూతురు అతన్ని పట్టుకొని ఏడవసాగింది. ‘మనం తప్పు చేయలేదు తల్లి.. నువ్వు ఏడవకు’ అంటూ శ్రీనివాస్ చెబుతాడు. అక్కడ ఉన్నవారు కూడా శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. ఇక విషయం పెద్దదిగా మారుతుందని గ్రహించిన పోలీసులు సదరు వ్యక్తిని అక్కడ నుంచి బలవంతంగా పంపించివేస్తారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఇంచార్జ్ స్పందిస్తూ.. ఎస్ఐ మునీరుల్లాను సదరు వ్యక్తి దూషించాడని తెలిపారు. మరోవైపు తన తండ్రి హెల్మెంట్ ధరించినా.. ధరించలేదని దూషిస్తూ పోలీసులు బైక్ తాళం తీసుకున్నారని అతని కుమార్తె ఏడుస్తూ చెప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉంది? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
POLICE STATE?#Mahabubnagar police conducting a drive to ensure people are wearing masks/helmets &following rules. They stopped this man who was apparently going for vegetables& slapped him. The man says you can fine me but who gives a right to slap me in front of my child? pic.twitter.com/UpnQPEjk5M
— Revathi (@revathitweets) December 6, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more