High Court asks Anantapur DEO to do social service ధిక్కారానికి పాల్పడిన డీఈఓకు.. హైకోర్టు సామాజిక సేవ శిక్ష

Andhra pradesh high court asks anantapur deo to do social service

Ananatapur, District Eduacation Officer, DEO, K Samuel, social service, food expenditure, High Court, Justice B Devanand, contempt of court, directions of court, orphanage, old-age home, P Venkataramana, notional seniority, principal secretary, Commissioner, School Education, Andhra pradesh, Crime

The Andhra Pradesh High Court asked Anantapur district education officer K Samuel do social service for a week as a punishment for contempt of court. He was asked to bear the food expenditure of any orphanage or old-age home in the district for the period.

ధిక్కారానికి పాల్పడిన డీఈఓకు.. హైకోర్టు సామాజిక సేవ శిక్ష

Posted: 12/07/2021 04:03 PM IST
Andhra pradesh high court asks anantapur deo to do social service

కోర్టు ధిక్కరణకు పాల్పడిన జిల్లా విద్యాశాఖ అధికారికి సామాజిక సేవ చేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశించింది. న్యాయస్థానం వెలువరించిన అదేశాలను పాటించడంలో నిర్లక్ష్యం వహించిన అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారికి న్యాయస్థానం వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలని శిక్షను విధించింది. ఈ కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు రుజువైన అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కె.శామ్యూల్ కు.. హైకోర్టు ఈ శిక్షను విధిగా అమలు చేయాలని సూచించింది. అయితే సామాజిక సేవ అంటే ఏమిటీ.. ఎలా అన్న అనుమానాలకు కూడా తావులేకుండా న్యాయస్థానం శిక్షకు సంబంధించిన వివరాలను కూడా వెలువరించింది.

వారం రోజులపాటు జిల్లాలోని అనాధ శరణాలయంలో కానీ లేదా వృద్దాశ్రమంలో కానీ వారం రోజుల పాటు అందులో వుండే వారి ఆహార ఖర్చును భరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు వారికి సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. దీంతో చేసేది లేక జిల్లా విద్యార్థికారి కె.శామ్యూల్ న్యాయస్థానం శిక్షను అంగీకరించారు. అంతకుముందు ఆయన న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. తనకు ఎలాంటి శిక్షను విధించరాదని, తాను న్యాయస్థాన ఉత్తర్వులను అమలుపరుస్తానని కూడా చెప్పారు. అయినా న్యాయస్థానం మాత్రం క్షమాపణలు వద్దు.. శిక్షను బాధ్యతగా అమలుపర్చండని అదేశించింది.

ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయంలో తనకు జరిగిన అన్యాయంపై 2019లో హైకోర్టును ఆశ్రయించారు. వెంకటరమణ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ సీనియారిటీ కల్పించకపోవడంతో గతేడాది ఆయన డీఈవోపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు వెంకటరమణ. ఈ క్రమంలో మరోమారు వెంకటరమణ పిటీషన్ ను విచారణలో భాగంగా హైకోర్టు అదేశాలు జారీ చేసింది.

వెంకటరమణ కోర్ఠుధిక్కార పిటీషన్ విచారణలో భాగంగా స్కూల్ ఎడ్యూకేషన్ ప్రిన్సిఫల్ సెక్రటరీ బి.రాజశేఖర్, విద్యాశాఖ కమీషనర్ చిన్న వీరభద్రుడు, అనంతపురం డీఈఓ కె.శామ్యూల్ లకు సమన్లు జారీ చేసి న్యాయస్థానానికి రావాలని అదేశాలు జారీచేసింది. దీంతో తమ అదేశాలను అమలుపర్చడంలో తప్పిందమంతా డీఈఓదేనని తేల్చిన న్యాయస్థానం ఆయనను తీవ్రంగా హెచ్చరించింది. న్యాయస్థానం అదేశాలను అమలుపర్చడంలో జాప్యానికి ఈ మధ్యకాలంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి అధికమౌతోందని వ్యాఖ్యానించింది. దీంతో డీఈవో క్షమాపణ కోరారు. అయితే, క్షమాపణను అంగీకరించాలంటే వారం రోజులపాటు జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో కానీ, అనాథాశ్రమంలో కానీ సామాజిక సేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించారు. ఇందుకు డీఈవో అంగీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles