భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించినట్లు భారత వాయుసేన ధ్రువీకరించింది. ఉత్తరాఖండ్‌లోని పారిలో జన్మించిన ఆయన కుటుంబం నాలుగు తరాలుగా భారత ఆర్మీకి సేవ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తొలి త్రివిధ దళాధిపతిగా భారత ప్రభుత్వం ఆయన్ను నియమించింది. భారత ఆర్మీ చీఫ్ గా ఆయన దేశానికి నాలుగేళ్ల పాటు సేవలు అందించారు. 2016 డిసెంబర్ 31న ఆయన భారత ఆర్మీ ఛీప్ గా పదవీ బాధ్యతలను చేపట్టిన ఆయన తన పదవీవిరమణ వరకు సేవలను అందించారు.
అంతకుముందు వాయుసేన, ఆర్మీ, నేవీకి వేరువేరుగా అధిపతులు ఉండేవారు. ఈ దళాల మధ్య మరింత సమన్వయం కోసం సీడీసీ పదవిని సృష్టించడం జరిగింది. ఈ పదవిలో తొలిగా నియమితులైన వ్యక్తి బిపిన్ రావత్.. 2020 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అత్యంత ధైర్య సాహసాలు చూపించే బిడ్డను ఈ దేశం కోల్పోయిందని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు.
”సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అకాల మరణం తీవ్రంగా బాధించింది. అత్యంత ధైర్య సాహసాలు చూపించే బిడ్డను ఈ దేశం కోల్పోయింది. అత్యంత శౌర్య ప్రతాపాలతో, హీరోయిజంతో ఆయన మాతృభూమికి సేవలందించారు. ఈ లక్షణాలతో ఆయన గుర్తింపు పొందారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను” -రాంనాథ్ కోవింద్ (రాష్ట్రపతి)
”రావత్ ఓ నిబద్ధత ఉన్న సైనికుడు. నిజమైన దేశభక్తుడు. దేశ రక్షణ వ్యవస్థను, రక్షణకు కావల్సిన ఉపకరణాల ఆధునికీకరణలో అద్భుతమైన సేవలందించారు. ఆయన మరణించడం నన్నెంతగానో బాధించింది. వ్యూహాత్మక, రక్షణ విషయాలపై ఆయనకున్న దృష్టి అద్భుతమైంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది మరణించడం ఎంతో బాధించింది. వారందరూ మాతృభూమికి ఎంతో సేవలు చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి…” -నరేంద్ర మోదీ (ప్రధాన మంత్రి)
”హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది మృతి చెందారన్న వార్త ఎంతో షాక్‌కు గురి చేసింది. ఈ విషయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో మాట్లాడా. నా సానుభూతిని వ్యక్తం చేశాను. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. ”– వెంకయ్య నాయుడు (ఉప రాష్ట్రపతి)
”అత్యంత ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తించిన వారిలో బిపిన్ రావత్ ఒకరు. మాతృభూమికి పరిపూర్ణ శ్రద్ధాసక్తులతో సేవలందించారు. ఆయన చేసిన సేవ, త్యాగం మాటల్లో చెప్పలేను. కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా” – అమిత్‌షా (కేంద్ర హోంశాఖ మంత్రి)
సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం ఎంతో బాధించిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘రావత్ అకాల మరణం దేశ రక్షణ వ్యవస్థకు, ప్రజలకు పూడ్చలేని లోటు’’ అని అన్నారు. ‘‘హెలికాప్టర్ ప్రమాద ఘటన అత్యంత దురదృష్ట సంఘటన, ఈ దుర్ఘటనలో రావత్ భార్య, ఇతర సిబ్బంది మరణించడం కూడా అత్యంత బాధాకరం’’ రాజ్‌నాథ్ సింగ్ (కేంద్ర రక్షణశాఖ మంత్రి)
‘‘ భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రావత్, ఆయన అర్ధాంగి మధులికతో పాటు మరో 11 మంది దుర్మరణం పాలైన ఈ ఘటన అత్యంత బాధాకరం. అత్యున్నత సీడీఎస్ బాధ్యతలను అందుకున్న తొలి అధికారిగా బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. త్రివిధ దళాలను సమన్వయ పరిచి దేశ రక్షణ వ్యవస్థలను పటిష్ఠపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న రావత్ మృతి దేశానికి తీరని లోటు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’’ పవన్ కల్యాణ్ (జనసేన అధ్యక్షుడు)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more