Experts recover black box of IAF’s Mi-17 chopper బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం..

Iaf chopper crash black box of ill fated mi 17vh helicopter recovered

Gen Bipin Rawat dead, Bipin Rawat dies, CDS dies, Bipin Rawat death reactions, Bipin Rawat death condolences, IAF chopper crash, bipin rawat helicopter crash near coonoor, tamil nadu helicopter crash, CDS Gen Bipin Rawat, IAF chopper crash, rawat helicopter, rawat helicopter crash, cds gen bipin rawat, indian air force, rajnath singh, parliament, Coonoor, Tamil Nadu, Crime

The flight recorder, popularly known as ‘Black Box’, of the ill-fated Indian Air Force(IAF) helicopter that crashed near Coonoor in Ooty leading to the loss of lives of Chief of Defence Staff General Bipin Rawat, his wife Madhulika, and 11 other armed personnel, was recovered on Thursday morning.

బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం..

Posted: 12/09/2021 10:34 AM IST
Iaf chopper crash black box of ill fated mi 17vh helicopter recovered

సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిపోవడానికి కారణాలు ఏమిటన్న విషయమై యావత్ దేశం ఉత్కంఠను కనబరుస్తోంది.  భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం పాలైన ఈ ఘటనకు అసలైన కారణాలు ఏమిటన్న విషయం తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణాల‌పై అధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నా.. కుప్పకూలిపోవడానికి అసలైన కారణాలను మాత్రం హెలికాప్ట‌ర్ బ్లాక్ బాక్స్‌లో నిక్షిప్తమై ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ బ్లాక్ బాక్స్ లో పైల‌ట్ల సంభాష‌ణ‌లు రికార్డ‌య్యే అవ‌కాశం ఉంటుంది.

బ్లాక్ బాక్స్ కోసం ఎయిర్ పోర్స్ వింగ్ కమాండర్ ఆర్ భరద్వాజ నేతృత్వంలోని 25 ప్రత్యేక బృందాలు అన్వేషణ కొనసాగించాయి. తొలుత తమ పరిధిని ఘటనాస్థలం నుంచి కేవలం 300 మీటర్లుగా చేసుకుని అన్వేషించగా, బ్లాక్ బాక్స్ లభ్యం కాలేదు. దీంతో ప్రత్యేక బృందాలు తమ పరిధిని కిలోమీటరు దూరం వరకు పెంచారు. దీంతో అన్వేషణ సాగిస్తున్న ప్రత్యేక బృందం అధికారులకు బ్లాక్ బాక్స్ లభ్యమైంది. హెలికాప్ట‌ర్ ప్ర‌మాద ద‌ర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీల‌కం కానుంది. ఇక ఈ ఘటనలో మరణించిన 13 మంది శరీర అవయవాలను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కూడా ఈ బృందాలు సర్చ్ అపరేషన్ ను ఇంకా కొనసాగిస్తున్నాయి.

ఘటనాస్థలం నుంచి మృతదేహాలను వెలింగ్టన్ అసుపత్రికి తరలించే విషయమై కూడా అన్వేషన్ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో ఈ హెలికాప్టర్ ప్ర‌మాదం, క్రాష్ కావడానికి కార‌ణాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు, కూలిపోయిన హెలికాప్ట‌ర్ కు సంబంధించిన మ‌రిన్ని పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య‌ మధులికా రావత్ అంత్యక్రియలు రేపు ఢిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. కాగా రావత్ సహా 12 మంది మృతదేహాలను ఇవాళ ఢిల్లీకి తరలించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles