I will join SP: BJP MLA Vinay Shakya మంత్రి బాటలోనే మరో బీజేపి ఎమ్మెల్యే.. ఎస్పీలో చేరిక

I am with sp maurya will join sp bjp mla vinay shakya rubbishes daughter s kidnapping claims

Vinay Shakya, Bidhuna MLA, Swami Prasad Maurya, Vinay Shakya BJP, Vinay Shakya SP, Vinay Shakya daughter Riya Shakya, Riya Shakya video, Riya Shakya Kidnap claims, Vinay Shakya kidnap, Vinay Shakya Samajwadi Party, Uttar Pradesh Assembly elections 2022

BJP MLA from Bidhuna Vinay Shakya, refuted the claims about his kidnapping and said that he will join the Samajwadi Party. Rubbishing the claims by his daughter Riya Shakya, that her father was 'kidnapped', Vinay Shakya said that he was with Swami Prasad Maurya who joined the Samajwadi Party (SP)

మంత్రి బాటలోనే మరో బీజేపి ఎమ్మెల్యే.. కిడ్నాప్ అరోపణలు తోసివేత

Posted: 01/12/2022 12:18 PM IST
I am with sp maurya will join sp bjp mla vinay shakya rubbishes daughter s kidnapping claims

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉన్న పార్టీలోంచి ఒకొక్కరుగా ఎమ్మెల్యేలు గెలుపు ఖాయమన్న పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ సిద్దాంతాలు, ఏజెండాలు, భవిష్యత్ కార్యక్రమాల గురించి మాట్టాడిన నేతలు.. ముందుగా తాము ఏ పార్టీలోకి వెళ్తే గెలుస్తామోనన్న విషయమై తమ అనుచరగణంతో సమాలోచనలు జరిపి విజయం తధ్యమన్న పార్టీలోకి జంపవుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి షాకిస్తూ ఆయన క్యాబినెట్లో కార్మికశాఖ మంత్రిగా వ్యవహరించిన ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య.. నిన్న బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎస్పీ పార్టీలో చేరారు. ఇక వారి బాటలోనే బిధునా ఎమ్మెల్యే వినయ్‌ షక్యా కూడా నడిచారు.

ఈ విషయం గురించి ఆలస్యంగా తెలుసిన ఆయన తనయ.. తన తండ్రిని తన సొంత చిన్నాన దేవేశ్ షక్యా తన వ్యక్తిగత రాజకీయాలో కోసం లక్నో తీసుకెళ్లారని రియా షక్యా అరోపించారు. అయితే ఆ ఆరోపణలను తాజాగా ఎమ్మెల్యే వినయ్‌ షక్యా ఖండించారు. తాను మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య వెంట ఉన్నానని, తర్వలోనే సమాజ్‌వాదీ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారని వారితో పాటు తాను నడిచేందుకు సిద్దపడ్డానని తెలిపారు. విషయం తెలియని రియా షక్య అరోపణల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 'వ్యక్తిగత రాజకీయాల' కోసం తన మామ తన తండ్రిని 'బలవంతంగా' లక్నో తీసుకెళ్లారని ఆ వీడియోలో అమె పేర్కొంది.

మా నాన్నకు కొన్నేళ్ల క్రితం పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే అదనుగా భావించిన మా చిన్నాన.. తమ తండ్రి పేరుతో వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్నారు. అందుకోసమే తన తండ్రిని బలవంతంగా పార్టీ మార్చేందుకు లక్నో తీసుకెళ్లారని అరోపించారు. అయితే ఈ అరోపణలను బిధునా పోలీసులు సైతం ఖండించారు. ఇవి నిరాధరా అరోపణలని కోట్టిపారేశారు. ఇదిలావుండగా, మారుతున్న పరిస్థితుల రిత్యా బీజేపిలో వణుకు మొదలైంది. ఐదేళ్లలో పరిస్థితులు తలకిందులైయ్యాయని కలవరానికి గురవుతోంది. అయితే బీజేపికి చెందిన మరో 13 మంది ఎమ్మెల్యేలు త్వరలో ఎస్పీ గూటికి చేరుతున్నారని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ప్రకటించడంతో పార్టీలో మరింత అందోళనకర పరిస్థితి అలుముకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles