కరోనా వైరస్ పై తొలుత నుంచి అధ్యయనాలు చేస్తున్న ఇద్దరు భారత సంతతి వైద్య నిపుణులు సూచనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అందుకు కారణం వీరు కరోనా మహమ్మారి అంతానికి ఒక ఆశ్చర్యకరమైన, అసాధారణమైన సూచనను ప్రతిపాదించడమే. ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. మెరుపు వేగంతో అందరికీ వ్యాప్తి చెందుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని భారత సంతతి వైద్య నిపుణులు ఈ మహమ్మారి వేరియంట్కు ప్రపంచ మానవాళి అంతా ప్రభావితం కావాలని అంటున్నారు. ఔనా.. ఎందుకు.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవు. ఇంతకీ ఇలా చెప్పిన ఆ ఇద్దరు భారత వైద్య నిపుణులు ఎవరు అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి.
అమెరికాకు చెందిన భారత వైద్య నిపుణులు వివేక్ రామస్వామి, అపూర్వ రామస్వామి ఈ మేరకు చేసిన సూచనలు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ లో ప్రచురితం అయ్యాయి. వీటి పట్ల ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. కరోనా ఒమిక్రాన్ ను వేగంగా అందరికీ పాకిపోనివ్వడం ఈ మహమ్మారిని అంతం చేయడానికి మెరుగైన మార్గమన్నది రామస్వామి దంపతుల సూచన. కానీ, ఇది నిప్పుతో చెలగాటమేనన్నది మరికొందరి అభిప్రాయంగా ఉంది. కానీ, రామస్వామి దంపతులు తమ సూచన వెనుక బలమైన నేపథ్యాన్ని వివరిస్తున్నారు. ‘‘ఒమిక్రాన్ వ్యాప్తిని తగ్గించేందుకు అనుసరిస్తున్న విధానాలతో.. మరింతగా ఇన్ఫెక్షన్ కలిగించే శక్తిమంతమైన వేరియంట్ ఏర్పడడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అది మరింత వైరల్ లోడ్ తో, టీకాల నిరోధకతను కలిగి ఉంటుంది. కనుక విధాన నిర్ణేతలు స్వల్ప లక్షణాలున్న ఒమిక్రాన్ తరహా రకాలు వేగంగా వ్యాప్తి చెందడాన్ని తప్పక సహించాలి.
మాస్కులు తప్పకుండా ధరించాలి, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనకు స్వస్తి పలకాలి. లేదంటే ఈ నిబంధనలు వైరస్ వ్యాప్తిని నిదానింపజేయడమే కాదు.. మరింత నష్టానికి దారి తీస్తాయి’’ అని రామస్వామి దంపతులు ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ లో ఆర్టికల్ రాశారు. వివేక్ రామస్వామి హెల్త్ కేర్ సంస్థ రోవియంట్ సైన్సెస్ ను స్థాపించి నిర్వహిస్తుంటే, అపూర్వ రామస్వామి ఓహియో స్టేట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కానీ, వీరి అభిప్రాయాలను కొందరు వైద్య నిపుణులే తోసిపుచ్చుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒమిక్రాన్ ను పట్టుకుందామని ప్రయత్నిస్తే అది డైనమేట్ తో ఆటలాడుకున్నట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more