కర్నాటకలో హిజబ్ (బురఖా) వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చతూనే ఉంది. ముందుగా ఉడిపి, కొలార్ జిల్లాల్లోని పలు కాళాశాలకు మాత్రమే పరిమితిమైన ఈ వివాదాం ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ నేపథ్యంలో హిజబ్ పై వివాదం కర్ణాటక రాష్ట్ర హైకోర్టులో ఉంది. ఇక న్యాయస్థానం కాళాశాలలు తెరవాలని అదేశాలు జారీ చేయడంతో ఇవాళ్టి నుంచి కర్ణాటకలో కాలేజీలు తెరిచారు. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడం సరికాదని, యూనిఫాంలో మాత్రమే రావాలని డిమాండ్ వస్తోన్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
దీంతో మళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభమైంది. కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి పాఠశాలలోకి వస్తుండడాన్ని చూసిన ఓ ఉపాధ్యాయురాలు వారిని అడ్డుకుంది. దీంతో ఆ ఉపాధ్యాయురాలితో విద్యార్థినుల తల్లిదండ్రులు గొడవ పెట్టుకున్నారు. మాండ్యలోని రోటరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. పాఠశాలలోకి అడుగు పెట్టేముందే హిజాబ్ తీసేయాలని ఉపాధ్యాయురాలు చెప్పింది. దీంతో చివరకు హిజాబ్ తీసేసి విద్యార్థినులు పాఠశాలలోకి వెళ్లారు. హిజాబ్‌తోనే పాఠశాలలోకి అనుమతించాలని ఉపాధ్యాయురాలిని తల్లిదండ్రులు వేడుకున్నప్పటికీ ఆమె వినిపించుకోలేదు.
ఇదిలావుండగా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ హిజబ్ పై వివాదంలో కల్పించుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలు, యువతులు హిజబ్ ధరించక పోవడం కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘హిబాజ్ అనే పదానికి ఇస్లాంలో పరదా అనే అర్థం ఉంది. యువతులు తమ అందాన్ని దాచుకోవడానికి హిజాబ్‌ను ధరించాల్సి ఉంటుంది. దేశంలో అత్యాచారాల రేటు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మహిళలు హిజాబ్ ధరించకపోవడమే’’ అంటూ పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగానే ఇతరుల నుంచి తమ అందాన్ని కాపాడుకోవాలనుకునే వారు హిజబ్ ధరిస్తారని ఆయన మాట మార్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more