సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ముందుంటారు. పంచుకోవడమే కాదు అవసరం అయితే సహకరం కూడా అందిస్తుంటాడు ఆయన. ఇటీవల ఐఐటీ చెన్నైకి చెందిన విద్యార్థుల సృజనాత్మకతకు ముగ్దుడైన ఆయన వారి 3డి ప్రింటింగ్ ఇళ్లు నిర్మాణం సంస్థలో తనను చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఇటీవల సైకిల్ ఎలక్ట్రికల్ కన్వర్షన్ కిట్ రూపోందించిన గురు సౌరబ్ కు కూడా అండగా వుంటానని ప్రోత్సహించారు. ఇలా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించి వెన్నుతట్టడం ఆయనలోని సుగుణం.
అలాంటి ఆనంద్ మహీంద్ర ఏకంగా ఓ హీరోకు కోసం వచ్చింది.. తాను ఊరు విడిచి వెళ్తానంటూ చమత్కరించారు. తన సంస్థ రూపోందించిన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడం ఆనంద్ మహీంద్రాకు అలవాటే. అయితే ఇలా కొత్తగా రూపోందించిన ట్రక్కు బస్సుల ప్రమోషన్స్ కోసం ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. ఈ వీడియోకు మరింత వీక్షకుల తాకిడి పోందేలా చేశారు. అందుకు ఆయన ఫన్నీగా పెట్టిన కామెంట్టే కారణం.
తాజాగా ఓ యాడ్ షూటింగ్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మహీంద్రా ట్రక్ బస్ కోసం చేపట్టిన షూట్లో.. పదే పదే స్ట్రిప్ట్‌లో మార్పులు ఎందుకు చేస్తున్నారంటూ అసహనంగా అడుగుతాడు అజయ్ దేవ్గన్.. పదే పదే మార్పులు చేయడం లేదు సార్ ఓ సాలుగైదు సార్లు అంతే అంటూ ఓ గొంతు వినిపిస్తుంది. వెంటనే కెమెరావైపు ఓ సీరియస్ లుక్ ఇస్తాడు అజయ్ దేవ్గన్. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కామెంట్ రాస్తూ.. మహీంద్రా ట్రక్‌బస్ షూటింగ్లో అజయ్ దేవగన్‌కి కోపం వచ్చినట్టు నాకు తెలిసింది. మా ట్రక్ బస్ వేసుకుని ఆయన నా కోసం వచ్చేలోగా.. ఊరొదిలి పారిపోతానంటూ చమత్కరించారు ఆనంద్ మహీంద్రా.
I was informed that @ajaydevgn lost his cool on a @MahindraTrukBus film shoot. I better leave town before he comes after me in one our trucks… pic.twitter.com/roXY7hIfRN
— anand mahindra (@anandmahindra) February 14, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more