ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం తొలి భేటీ సందర్భంగా విభజన చట్టంలో మార్పుల అంశం చర్చకు వచ్చింది. అయితే దీనిని తెలంగాణ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన జరిగిన ఏడున్నరేళ్ల తరువాత విభజన చట్టంలో మార్పులు తీసుకురావాలని అనుకోవడంతో ఇదివరకే పరిష్కరించబడిన పలు సమస్యలు మళ్లీ పునరావృతం అవుతాయని అభిప్రాయపడింది. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌తో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశీష్ కుమార్ సమావేశం అయ్యారు.
ఈ భేటీలో కొన్ని కీలక సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయి. బకాయిల చెల్లింపునకు ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. కోర్టు కేసులను ఏపీ ఉపసంహరించుకుంటే విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారానికి సిద్ధమని తెలంగాణ స్పష్టం చేసింది. కేసుల ఉపసంహరణతోనే ఏపీఎస్ఎఫ్సీ -ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన సైతం సాధ్యమని తెలంగాణ పేర్కొంది. పన్నులకు సంబంధించి విభజన చట్ట సవరణ అవసరం లేదని తెలిపింది. తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్ ఏకీభవించారు.
ఫలితంగా పన్నుల అంశం ద్వైపాక్షిక జాబితా నుంచి తొలగించేందుకు అంగీకారం కుదిరింది. అయితే ఏపీ నుంచి నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని తెలంగాణ కోరింది. రాజ్‌భవన్, హైకోర్టు నిర్వహణ బకాయిలు కూడా రాలేదని పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి.. ఏపీ నగదు బకాయిల వివరాలు పంపాలని సూచించారు. కేంద్ర రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేందుకు సిద్ధమని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై అండర్ టేకింగ్ ఇచ్చేందుకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సిద్ధమని ప్రకటించింది. ఏపీ అండర్ టేకింగ్, రాయితీ వాటా ఇస్తే రూ.354 కోట్ల చెల్లింపునకు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ అంగీకారం తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more