తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తులకు ఇవాళ రెండు శుభవార్తలను అందించింది. ఒకటి కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆంక్షల మధ్య పరిమితి సంఖ్యలోనే భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతున్న తరుణంలో ఇప్పటికే సర్వదర్శనం టికెట్లను అప్ లైన్ లో విడుదల చేసిన టీటీడీ.. ఇకపై ఈ సంఖ్యను కూడా మరింతంగా పెంచనుంది. దీంతో పాటు శీఘ్రదర్శనం టికెట్ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచనున్నారు. అయితే శ్రీవారి అర్జిత సేవలకు టికెట్ల ధరలను పెంచనున్నారన్న వార్తల నేపథ్యంలోనూ టీటీడీ భక్తులకు మరో శుభవార్తను చెప్పింది. మార్చి 2020 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను వర్చువల్ విధానం ద్వారా నిర్వహించిన టీటీటీ ఇకపై ప్రత్యక్షంగా పునరుద్దరణ చేయనున్నారు.
తిరుమలలోని ఇకపై తిరుమల కొండపై హోటళ్లు ఉండవని తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో ప్రైవేటు హోటళ్లను తొలగిస్తామని అన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీనే ఉచితంగా అన్న ప్రసాదం అందజేస్తుందని చెప్పారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరికీ ఒకటే ఆహారం లభిస్తుందని స్పష్టం చేశారు.
హోటళ్లు లేకుండా, భక్తులకు భోజనం అందించేందుకు టీటీడీ తగిన చర్యలు తీసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో మరిన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ కోసం ఏర్పాట్లు చేస్తామని, భారీ ఎత్తున అన్న ప్రసాదం తయారీకి సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల యజమానులకు ప్రత్యామ్నాయ వ్యాపారాలు చేసుకునేందుకు లైసెన్స్‌లు జారీ చేస్తామన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,096.40 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ, ఇది 2021-22కి సవరించిన బడ్జెట్ అంచనాల రూ. 3,000.76 కోట్ల కంటే రూ. 95.64 కోట్లు ఎక్కువని తెలిపింది.
* సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి పిల్లల ఆసుపత్రిని నిర్మాణ ప్రతిపాదనకు ట్రస్ట్‌బోర్డు ఆమోదం. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం.
* బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ను నిర్మించేందుకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు.
* సైన్స్ సిటీకి కేటాయించిన 70 ఎకరాల్లో 50 ఎకరాలను టీటీడీ పునఃప్రారంభించి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మిస్తుంది.
* అన్నప్రసాదం తయారీ కోసం శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవన్‌కు 25 ఏళ్లపాటు సోలార్ పవర్ స్టీమ్‌ను అందించేందుకు ఎన్‌ఈడీసీఏపీతో టీటీడీ ఎంఓయూ.
* తిరుమలకు పాత అన్నమయ్య మార్గాన్ని పునరుద్ధరించాలని, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీ శాఖను సంప్రదించాలని నిర్ణయం.
* ముంబైలోని వెంకటేశ్వర ఆలయానికి స్థలం కేటాయించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్న టీటీడీ ప్రతినిధి బృందం.
* హిందూ ధర్మప్రచార పరిషత్ మండలి సమావేశంలో శ్రీనివాస వ్రత విధానం పుస్తకాలు ప్రచురించి ఆచారానికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు.
* గరుడ వారధి నిర్మాణానికి టీటీడీ దశలవారీగా రూ.150 కోట్లు విడుదల చేసి డిసెంబర్‌లోగా పూర్తి చేయనుంది.
* 2.73 కోట్లతో శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) కంప్యూటరీకరణకు టిటిడి ఆమోదం.
* కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రహిత చికిత్సకు రూ.25 కోట్ల నిధులు
* తిరుమలలో నాద నీరాజనం షెడ్డు స్థానంలో శాశ్వత మండప నిర్మాణం.
* 3.60 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేయడంతోపాటు ఏపీ అంతటా ఆయుర్వేద ఉత్పత్తులను సరఫరా చేసేందుకు టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ
* తిరుమల ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, గోపురం బంగారు తాపడంపై సాధ్యాసాధ్యాలను టీటీడీ చేపట్టనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more