పోలీసు అవతారం ఎత్తిన దొంగలు.. వ్యాపారులను బురడీ కొట్టించి ఏకంగా రూ.89 లక్షలతో ఉడాయించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో చోటుచేసుకుంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు కచ్చితంగా వీరి సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ లో ఈ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుల నుంచి రూ.89 లక్షలు దోచుకుని పారిపోయారు.
గుంటూరు జిల్లాలోని దుర్గి మండలానికి చెందిన ప్రకాశరావు, అజయ్ కుమార్, రామశేషయ్యలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నడికుడి రైల్వే జంక్షన్ కు వచ్చారు. అక్కడి నుంచి చెన్నై వెళ్లేందుకు టిక్కెట్లు తీసుకున్నారు. వీరు తమతో పాటు రెండు బ్యాగులను తీసుకొచ్చారు. ప్లాట్ ఫాం పై రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో కారులో నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వ్యాపారుల వద్దకు వచ్చి, పోలీసులు పిలుస్తున్నారని చెప్పారు. వారిని ఏమార్చి రెండు బ్యాగులను తీసుకుని ఉడాయించారు. తేరుకున్న బాధితులు లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు విషయాన్ని వివరించారు.
రెండు బ్యాగుల్లో రూ.89 లక్షలు నగదు ఉందని, తమను మాటల్లో పెట్టి, బ్యాగులు తీసుకుని పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నగదు మొత్తాన్ని వ్యాపార పనుల కోసం చెన్నై తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిందని వాపోయారు. బాధితుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు ప్రాంతంలోని పలు పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సిసిటీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆనవాళ్ల కోసం ప్రయత్నిస్తునే.. వారి కోసం గాలిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే దోపిడికి పాల్పడి ఉంటారని వ్యాపారులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more