People with heart defects at greater risk for COVID-19 హృద్రోగ బాధితుల్లో కరోనా తీవ్రత అత్యధికం..

People with heart defects at greater risk for severe illness death if hospitalized for covid 19

Corona Effect, Coronavirus, Covid-19, Heart defects, heart problems, Cardiac Patients, American Heart Association, congenital heart defects, critically sick, ventilator, intensive care unit, heart failure, pulmonary hypertension, Down syndrome, diabetes, obesity, coronavirus

People hospitalized with COVID-19 were up to twice as likely to die or be critically sick if they also had congenital heart defects, new research finds. Heart defects also had a higher risk of needing a ventilator or being treated in the intensive care unit than people without heart defects, according to the study published Monday in the American Heart Association journal Circulation.

హృద్రోగ బాధితుల్లో కరోనా తీవ్రత అత్యధికం.. తాజా అధ్యయనం

Posted: 03/08/2022 10:04 PM IST
People with heart defects at greater risk for severe illness death if hospitalized for covid 19

హృద్రోగ సమస్యలతో సతమతం అవుతున్నారా.. అయితే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు కరోనా మహమ్మారి సోకితే అది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. హృదయ సంబంధ సమస్యతో బాధపడేవారు కోవిడ్‌ బారినపడి ఆస్పత్రుల్లో చేరితే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో స్పష్టం చేస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన పక్షంలో లక్షణాలు తీవ్రంగా ఉండకపోయినా.. అది హృద్రోగ సమస్యలతో బాధపడేవారిపై మాత్రం తీవ్రప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని ఇదివరకే దేశంలోని హృద్రోగనిపుణులు కూడా నిర్ధారించారు.

ఇక తాజాగా అమెరికన్ వైద్య నిపుణులు జరిపిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్థారించింది. గుండె లోపాలు లేనివారితో పోలిస్తే హృద్రోగ సమస్యలున్నవారిలో కోవిడ్‌ తీవ్రత అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. గుండె సంబంధిత వ్యాదిగ్రస్తులకు కరోనా మహమ్మారి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చునని అభిప్రాయపడ్డారు. వీరు కరోనా బారిన పడితే మరణించే శాతం అధికంగా ఉంటుందని తెలిపారు. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అంతరంగిక సర్క్యూలేషన్ లోని జర్నల్ లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితం అయ్యాయి.

గుండె సమస్యలున్న వారికి కరోనా సోకితే వారికి ఐసీయూలో చికిత్స కానీ.. వెంటిలేటర్‌ అవసరం కానీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలు, 50 ఏళ్ల వయసు పైబడిన పురుషులకు కరోనాతో ముప్పు ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. పుట్టుకతోనే గుండె లోపాలు ఉన్న వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 157 మంది ఉంటారని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.
 
ఈ వివరాలన్ని గుండె జబ్బులు, స్ట్రోక్‌ గణాంకాలు-2022 నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే మార్చి 2020 నుంచి జనవరి 2021 వరకు ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల వివరాలను పరిశోధకులు పరిశీలించారు. గుండె లోపాలు క‌లిగిన‌, గుండె లోపాలు లేని రోగులు ఇవే ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. వ‌య‌సు, లింగం, జాతి, ఆరోగ్య బీమా ర‌కాలు, గుండె జ‌బ్బులు, ప‌ల్మన‌రీ హైప‌ర్ టెన్షన్‌, డౌన్ సిండ్రోమ్‌, మ‌ధుమేహం, స్ధూల‌కాయం వంటి అధిక ముప్పు కార‌కాల ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles