చైనాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ దడ పుట్టిస్తోంది. దీనికి తోడు దాదాపు ఏడాది కాలం తర్వాత చైనాలో కరోనా మరణాలు కూడా సంభవించాయి. జిలిన్ ప్రావిన్స్ లో ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా మృతి చెందారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇక చైనాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో లక్షణాలతో కూడిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో చైనా అప్రమత్తమవుతోంది. కఠిన ఆంక్షలను విధిస్తోంది. ఇటీవల కనీసం 10 నగరాల్లో లాక్ డౌన్ విధించింది.
ఇక ఇదే సమయంలో అటు దక్షిణ కొరియాలో కూడా అదే తరహాలో ఈ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రోజువారిగా 6 లక్షల కేసుల రికార్డును నమోదు చేసింది. దీంతో కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని వైద్యులు చెపుతున్నారు. జూన్, జులై మాసాల్లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరోమారు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ అరోగ్య సంస్థ డబ్యూహెచ్ఓ అప్రమత్తమైంది. వైరస్ ఇంకా బలంగానే ఉందని, మున్ముందు మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
వైరస్ పూర్తిగా క్షీణించలేదని, సీజనల్ వ్యాధిలా మారలేదని స్పష్టం చేసింది. మున్ముందు మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా తగ్గుముఖం పట్టిందని, కాబట్టి సులభంగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు. యూకేలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో వైరస్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిన తర్వాత అక్కడి నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇది చేరుకుంటుందన్నారు. కాబట్టి దానిని సమూలంగా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టకపోతే మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more