హ్యాకింగ్ అనే విద్యను కొందరు హ్యాకర్లు ప్రముఖుల, ప్రతిష్టాత్మక సంస్థ అకౌంట్లు హ్యాక్ చేసి తమ సత్తాను చాటుకుంటారు. పలు సందర్భాలలో ఈ హ్యాకర్లు ఉగ్రవాద మూకలకు చెందినవారు కూడా ఉంటారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో అనేక అకౌంట్లను హ్యాక్ చేసి.. ఉగ్రవాదానికి సంబంధించిన రాతలు కూడా రాసిన విషయం తెలిసిందే. కాగా, పలువురు హ్యాకర్లు మాత్రం తమ సరదా కోసమే, లేక డబ్బు కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ.. ఎదుటివారి కష్టంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇలా హ్యాక్ చేసిన అకౌంట్లలో అసాధారణమైన కంటెంట్ పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీంతో టీడీపీ వర్గాలు ట్విట్టర్ సంస్థ సహాయంతో తమ ఖాతాను పునరుద్దరించే పనలిలో పడింది. అధికారిక టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసి.. అందులో ఎలన్ మస్క్ కు చెందిన 'స్పేస్ ఎక్స్' ఫొటోలను అందులో షేర్ చేశారు. అర్థం కాని విచిత్రమైన ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు టీడీపీ ప్రకటించింది. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ... తమ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. ట్విట్టర్ ఇండియా సహకారంతో ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
పెగాసస్ స్పైవేర్ వివాదంపై నారా లోకేష్ చేసిన పోస్ట్‌కు చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు వ్యంగ్య సమాధానాలను పోస్ట్ చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసి కోట్లు ఖర్చు చేశారని ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను టీడీపీ ఖండించింది కానీ సోషల్ మీడియా సర్కిల్‌ల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 2 గంటలకు టీడీపీ ట్విటర్ ఖాతా హ్యాక్ కావడంతో కోర్ టీమ్ ఆ ఖాతాను పునరుద్ధరించింది. పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేసే పనిలో ఉన్నారు. వీకెండ్ కావడంతో ట్విట్టర్ ఇండియా కూడా సమయాన్ని తీసుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more