Revanth Reddy slams KCR govt on grabbing farmers Land మెదక్ చేరుకన్న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..

Madhya pradesh congress leader meenakshi s padyatra reached medak

Sarvodaya Sankalp Padyatra, Rajiv Gandhi Panchayat Raj Sangathan (RGPRS) Chairman, Meenakshi Natarajan Padayatra, Bhoodan Pochampally, Revanth Reddy, Congress, RGPRS, land reforms, economic disparities, KCR unfilled promises, KCR RRR Land grabbing, Medak, Telangana, Politics

Rajiv Gandhi Panchayat Raj Sangathan (RGPRS) Chairman Meenakshi Natarajan began her Sarvodaya Sankalp Padyatra from Bhoodan Pochampally in Yadadri Bhuvanagiri district. Marking 75 years of Bhoodan movement, the padyatra was flagged off by Congress leaders including AICC secretary Bose Raju and Others.

మెదక్ చేరుకన్న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. కేసీఆర్ సర్కార్ పై రేవంత్ ఫైర్..

Posted: 03/19/2022 01:36 PM IST
Madhya pradesh congress leader meenakshi s padyatra reached medak

భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ నాయ‌కురాలు మీనాక్షి నటరాజన్ చేపట్టిన‌ సర్వోదయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గత సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి నుంచి ఈ పాదయాత్ర పాదయాత్ర ప్రారంభం కాగా, ఇవాళ ఉదయం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కు చేరుకుంది. దేశంలోని దళితులు, గిరిజనులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఆమెకు ప‌లు రాష్ట్రాల కాంగ్రెస్ నేత‌లు మద్ద‌తు తెలుపుతున్నారు.

ఈ పాద‌యాత్ర‌లో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ‌లో రైతులు, దళితులు, గిరిజనులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్ర‌స్తావించారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ ధరణి పోర్టల్‌తో రైతులు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు. మ‌రోవైపు, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల‌ పేర్ల‌తో రైతుల నుంచి భూములు లాక్కుంద‌ని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన బంధువు కోసమే కొండపోచమ్మను రీడిజైన్ చేశారని అన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి నీరు కేసీఆర్ ఫాంహౌస్‌కు మాత్ర‌మే వెళ్తున్నాయ‌ని తెలిపారు.  

రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో మ‌ళ్లీ భూములు లాక్కొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రైతుల నుంచి రూ.3 కోట్ల విలువైన భూముల‌ను లాక్కుని రూ.10 లక్షలు ఇస్తామ‌ని చెబుతున్నార‌ని మండిపడ్డారు. రైతుల‌ను వరి పండించ‌కూడ‌ద‌ని చెప్పిన కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మాత్రం వరి పండించార‌ని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతుల భూమికి విలువలేకుండా పోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వం రైతు రుణమాఫీ చేయ‌ట్లేద‌ని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమితో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మోసం చేశార‌ని, ఆయ‌న‌ను ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయని రేవంత్ మండిప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  RGPRS  Meenakshi Natarajan  Sarvodaya Sankalp Padyatra  Revanth Reddy  Medak  Telangana  Politics  

Other Articles