దేశరాజధాని ఢిల్లీ నగరంలో కారులో వెళ్తున్న వ్యక్తులను వెంబడించి.. యధేశ్చగా కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో దేశరాజధానిలో భద్రతపై పలు ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో పనిచేస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని సుభాష్ నగర్లో జరిగిన ఈ ఘటనలో ఇదివరకే ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరోకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీ ఆన్ లైన్లో వైరల్ గా మారింది. ఢిల్లీలోని సుభాష్ నగర్లో కారులో వెళ్తున్నవారిని టార్గెట్ చేసిన ఇద్దరు అగంతకులు.. వారు కారు కదులుతున్నా వారిపై కాల్పులు జరిపారు. తొలుత కారుకు సమీపం నుంచి కాల్పులు జరిపిన వీరు.. ఆ తరువాత కారుకు కొంత దూరంగా ఉంటూ కాల్పులకు తెగబడ్డారు. కొద్ది నిమిషాల పాటు వెనక్కి వెళ్లిన అగంతకులు.. కారు కదలకుండా అక్కడే ఉండడంతో మరోమారు కాల్పులకు తెగబడ్డారు. ఒక వీరిలోని ఓ ఆగంతకుడు రోడ్డుపైనే తుపాకీలోని తూటాలను మార్చి మరీ కారుపై కాల్పులకు తెగబడటం కనిపించింది. ఈ లోగా కారు వేగంగా ముందుకు కదిలింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కిశోర్‌పూర్ సబ్జీ మండి యూనియన్ మాజీ చైర్మన్ అజయ్ చౌదరి, ఆయన సోదరుడు జశ్వంత్ కలిసి కారులో సుభాష్ నగర్‌కు శనివారం రాత్రి చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన ఓ ఇద్దరు అగంతకులు.. అజయ్ చౌదరి కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. సుమారు 10 నుంచి 15 రౌండ్ల కాల్పులు జరపడంతో చౌదరితో పాటు జశ్వంత్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సుభాష్ నగర్ చేరుకుని, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#UPDATE | One more accused arrested in connection with the firing incident in Delhi's Subhash Nagar area: Delhi Police https://t.co/kmbZLoMGR0
— ANI (@ANI) May 10, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more