ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ హింసాత్మకంగా తయారవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చాయి. ప్రజాగ్రహానికి తలొగ్గిన ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినా.. ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు నిరసనకారులు తమ దుస్థితికి కారణమైన పాలకుల ఇళ్లపై దాడులకు తెగబడటంతో అవి మరింత హింసాత్మకంగా మారాయి. రాజపక్స పూర్వీకులకు సంబంధించిన ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని మహిందా రాజపక్సతో పాటు పలు ఎంపీల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
శ్రీలంక రాజధాని కొలంబోకు 250 కిలోమీటర్ల దూరంలోని హంబన్‌తోటలో ఉన్న రాజపక్స పూర్వీకుల ఇంటిని సైతం ఆందోళనకారులు వదల్లేదు. ఆ ఇంటిని కూడా తగులబెట్టారు. దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇక రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు తెలియడంతో.. ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. బస్సులు తగులబెట్టారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు రాజపక్స తల్లిదండ్రుల స్మారకాలను ధ్వంసం చేశారు. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 190 మందికి పైగా గాయపడ్డారు. ఆందోళనలను నిలువరించేందుకు బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు.
మరోవైపు నిన్న ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలోకి వెళ్లిన ఎంపీ అమరకీర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై ఆందోళనకారులు దాడి చేశారు. గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రకటించేందుకు సజిత్ వచ్చారు. అప్పటికే అక్కడ ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రేమదాసపై ప్రభుత్వ అనుకూల వర్గీయులు దాడి చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గీయులు కూడా ఆయనపై దాడికి యత్నించడం గమనార్హం.
ప్రభుత్వాన్ని గద్దెదించడంలో విఫలమయ్యారంటూ దాడికి యత్నించారు. దీంతో ఆయన చాలా దూరం పరిగెత్తి, కారెక్కి పారిపోయారు. శ్రీలంకలో పలుచోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనలు అదుపులోకి రాకపోవడం గమనార్హం. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగిపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. దీంతో నిరసనకారులు ప్రభుత్వ మద్దతు దారులపై దాడులకు దిగారు.
PM Mahinda Rajapaksa’s ancestral home in Madamulluna has been set on fire. pic.twitter.com/JAN52w5Gxw
— DailyMirror (@Dailymirror_SL) May 9, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more