ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో క్రైం రేట్ చాలా ఎక్కువ. ప్రతీరోజు ఈ రాష్ట్రంలోని ఏదో ఒక మూల రాష్ట్రానికి చెందిన ఆడపడచులు లైంగికదాడులను ఎదుర్కోవాల్సి వస్తూనేఉంది. ఇక తాజాగా ఈ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మూడు రోజుల వ్యవధిలో ఓ కన్నెపిల్ల కలలు నెరవేరనున్న రోజు. అమెను కన్న తల్లిదండ్రుల భారం తగ్గే రోజు. తమ కూతురి పెళ్లి నిశ్చయమై ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ తరుణంలో గ్రామంలోని కొందరు స్నేహితులకు, పరిచయస్థులకు పత్రికలు ఇచ్చేందుకు బయలుదేరిన యువతి కనిపించకుండా పోయింది.
మరో 72 గంట్లలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి కనిపించకుండా పోవడంతో.. ఆ తల్లిదండ్రులు, అప్పటికే వారింటికి చేరిన బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పెళ్లి తంతు రద్దు అయ్యింది. అమ్మాయి కనిపించడం లేదని బంధుజనానికి కూడా చెప్పి వారిని తిప్పి పంచించేశారు. అయితే ఆ యువతిని వెంబడించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. అపహరించారు. కొన్న రోజుల పాటు తమ వద్దే బంధీగా ఉంచుకుని అమెపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగని దుండగులు.. యువతిని ఓ నేతకు అమ్మేశారు. అతను కూడా యువతిపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ తరువాత మధ్యప్రదేశ్ కు తరలించాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది బాధితురాలు.
వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జిల్లాలోని ఓ గ్రామంలో నివాసముంటున్న ఓ యువతికి ఏప్రిల్ 21న పెళ్లి జరగాల్సి ఉంది. గ్రామంలో నివసించే బంధువులకు, మిత్రులకు పెళ్లి పత్రికలను ఇచ్చేందుకు ఏప్రిల్ 18న ఇంటి నుంచి బయలుదేరింది. కాగా.. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను వెంబడించారు. అమె వెంట వెళ్లి ఎవరూ లేని సమయం కోసం వేచి చూసి.. ఆమెను అపహరించారు. అనంతరం అమెను ఓ నిర్ఝన ప్రదేశానికి తరలించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. కొన్ని రోజుల పాటు బాధితురాలిని ఆ ముగ్గురు వేరువేరు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.
అనంతరం ఝాన్సీలోని ఓ రాజకీయ నేతకు బాధితురాలని విక్రయించారు. దీంతో యువతిని ఓ ఇంట్లో బంధించిన నేత అమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఆమెను మరొకరు.. దాతియాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. వేరే వ్యక్తి దగ్గర ఆమెను ఉంచారు. అక్కడ ఆమెకు ఫోన్ లభించడంతో.. తన తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పగా ఆయన. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాతారి గ్రామం నుంచి యువతిని పోలీసులు రక్షించారు. యువతి చెప్పిన వివరాల ప్రకారం.. ఆమెపై అత్యాచారం జరిగినట్టు, బాధితురాలిని అపహరించి, అమ్మేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనను పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఆధారాలు లభిస్తే.. నిందితులను కఠినంగా శిక్షించే యోచనలో వారున్నట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more