తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. మరోమారు కోస్తాంధ్ర తీరాన్ని టార్గెట్ చేసుకుని విరుచుకుపడేందుకు రెడీగా వున్న ‘అసని’ తుపాను కాసింత శాంతించి ఊరట ప్రకటించింది. రేపు సాయంత్రానికి అసని బలహీనపడుతుందని, తీరాన్ని తాకే అవకాశాలు తక్కువని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం తుపాను కాకినాడకు 300 కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. 10 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని, తద్వారా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
తుపాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నట్టు తెలిపింది. కాగా, ఇప్పటికే విశాఖపట్టణం సహా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. మరోవైపు పూరీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే తుపాను కేంద్రీకృతమై ఉందని ఒడిశా వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న చెప్పారు. తుపానుతో భారత్ తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ పైనా ప్రభావం ఉండనుంది. కాగా, తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడును వర్షాలు తాకాయి. చెన్నై, తిరుచురాపల్లి, కడలూరు, పుదుచ్చేరి, సేలం, కరైకల్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, ఒడిశాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విమానాలు రద్దు చేసిన సంస్థలు
తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీరం వెంబడి గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని కోరింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... గురువారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు, తుపాను నేపథ్యంలో విశాఖకు విమాన రాకపోకలు రద్దయ్యాయి.
తెలంగాణలోనూ నాలుగు రోజులు వర్షాలు
అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఇండిగో సంస్థలు ప్రకటించాయి. రానున్న రెండు రోజుల్లో మాత్రం తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ నాగర్నత తెలిపారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్ శాస్త్రవేత్త ఆర్కె జెనామణి మాట్లాడుతూ తీవ్ర తుఫాను 'అసని' తీరానికి దూరంగా సముద్రం మీదుగా తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకదని తెలిపారు.
అసని ప్రభావంతో ఒడిశాలోని కొన్ని కోస్తా జిల్లాల్లో మే 10 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. మే 9-10 తేదీల్లో మధ్య బంగాళాఖాతం, మే 10-12 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. తుపాను దృష్ట్యా కోల్కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) తన ఉద్యోగులను , విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సైక్లోన్ అసని అనేది శ్రీలంకలో పెట్టిన పేరు. సింహళీలో దీని అర్థం 'కోపం'.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more