Heroic onlookers, police lift car to rescue motorcylist కారు కింద చిక్కకుపోయిన బైకర్.. ఎలా బయటకు వచ్చాడంటే..!!

Viral video heroic onlookers police lift car to rescue motorcylist trapped underneath

onlookers rush to save motorcyclist, people lifting car to save motorcylist, people lifting car to rescue biker, viral video, biker trapped under car, good news movement, onlookers, rush to save life, motorcyclist, people lift car, motorcylist, rescue biker, viral video, biker trapped, north corolina, United state, Crime

Traffic camera footage shows how two motorcyclists got in an accident after an approaching car nearly ran them over from behind in the USA's South Carolina. While the one driving it was sent flying and fell a few feet from his bike, the pillion rider got trapped underneath the car.

ITEMVIDEOS: కారు కింద చిక్కకుపోయిన బైకర్.. ఎలా బయటకు వచ్చాడంటే..!!

Posted: 06/04/2022 06:25 PM IST
Viral video heroic onlookers police lift car to rescue motorcylist trapped underneath

మ‌న‌స్సుంటే మార్గం ఉంటుందన్నది పెద్దలు చెప్పిన నానుడి. అయితే కొన్ని సందర్భాలలో మనస్సున్న మారాజులు కదిలి చేసే సాయం కూడా చాలా గొప్పది. మానవ శక్తికి అతీతమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రాణాలు పోయడం. నిజమే.. అందుకనే వైద్యులను కూడా మనం నారాయణులుగా కొలుస్తాం. కానీ ఇక్కడ వీరు వైద్యులు కాదు.. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, ఇతర వాహనదారులు.. వారితో పాటు స్థానిక పోలీసులు.. ఒక నిండు ప్రాణాన్ని కాపాడటానికి శ్రమించి సఫలమయ్యారు. నిండు జీవితాన్ని నిలిపారు. అయితే వీరు చేసిందల్లా మనవతాధృక్పథంతో సాయం చేయడమే.

సమయానికి అవకాశమివ్వకుండా.. అవసరం అని తెలిసిన కొద్ది నిమిషాల వ్యవధిలో పరుగు పరుగున ఎక్కడి నుంచి వచ్చారో.. ఎలా వచ్చారు అన్న వివరాలు తెలియదు కానీ.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వారు చేసిన సాయం నిండు ప్రాణాన్ని నిలిపింది. మాయమైపోయాడమ్మా మనిషన్నవాడు అన్న అగ్రరాజ్యంలో మనవాతావాధులు కలిసి ప్రాణాన్ని నిలపడం నిజంగా ఆశ్చర్యకరమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. యూఎస్‌లో ఓ కారుకింద ప్ర‌మాద‌వ‌శాత్తూ ఓ బైక‌ర్ ప‌డిపోగా, పోలీసులు, స్థానికులు కారును అమాంతం పైకి లేపారు. ఆ బైక‌ర్ ప్రాణాలు కాపాడారు.

వివరాల్లోకి వెళ్తే అగ్రరాజ్యం అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఖాళీగా వున్న రోడ్డుపై రెండు బైకులు వెళ్తున్నాయి. వారికి వెనుకగా ఓ కారు కూడా వస్తోంది. స్తానిక ప్రధాన కూడలి వద్ద సిగ్నల్ పడటంతో ఒక బైక్ అగగా, మరో బైక్ ముందుకు వెళ్లసాగింది. ఇదే సమయంలో వెనుకనుంచి వచ్చిన కారు.. నెమ్మదించిన బైక్ ను ఢీ కోట్టి.. ముందుకెళ్లి ఆగింది. దీంతో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్య‌క్తి ఎగిరి కొంత‌దూరంలో ప‌డ‌గా, వెనుకున్న వ్య‌క్తి కారుకింద చిక్కుకుపోయాడు. ఈ ఘటనతో హుటాహుటిన స్థానికులు పెద్దసంఖ్యలో చేరుకుని కారును ఎత్తే ప్రయత్నం చేశారు. పోలీసులు ప‌రుగున‌వ‌చ్చి స్థానికుల స‌హాయంతో కారును సినిమాటిక్ స్టైల్‌లో పైకి లేపారు. దీంతో కారు కింద పడిన వ్య‌క్తిని ప్రాణాల‌తో కాపాడారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా, 16గంట‌ల్లోనే మిలియ‌న్ మంది వీక్షించారు.

 
 
 
View this post on Instagram

A post shared by Good News Movement (@goodnews_movement)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles