హైదరాబాద్‌లోని ఆమ్నేషియా పబ్ సమీపంలో బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అసలు సూత్రధారి ఎవరు.? బెంజ్ కారు ఎవరిది.? ఇన్నోవా వాహనం ఎవరి పేరున ఉంది.? నేరాలు జరిగిన ఈ కార్లను పోలీసులు ఎందుకు సీజ్ చేయకుండా ఉన్నారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తులను తప్పించారన్న అరోపణలు కూడా తారాస్థాయిలో వినబడుతున్నాయి. ఇవి ప్రతిపక్షాలతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు కూడా వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే పోలీసులు ఈ కేసుల విషయంలో ప్రభుత్వం తరపున తీవ్రమైన ఒత్తడిని ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ క్రమంలో వారు అనేక నిజాలను దాటవేస్తున్నారని కూడా అరోపణలు వినబడతున్నాయి.
ఈ విషయాలను పక్కనబెడితే.. లో ప్రధాన సూత్రధారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడేనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాలికను తొలుత మాటల్లోకి దింపి ఆకర్షించింది అతడేనని, గతంలోనూ మనం ఒకసారి కలిశామంటూ మాటలు కలిపాడని అందులో పేర్కొన్నారు. ఆపై ఇంటివద్ద దించుతానంటూ నమ్మించి బాలికను తీసుకెళ్లాడు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు తీసుకెళ్లి బాలిక నుంచి బ్యాగ్, కళ్లద్దాలు, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. అనంతరం బాలికను కారులోనే కూర్చోబెట్టి నిందితులందరూ బేకరీలోకి వెళ్లి తిని, సిగరెట్లు తాగారు.
ఆ తర్వాత బాలిక వద్దకు వచ్చి కారులో తమతోపాటు వస్తేనే తీసుకున్న వస్తువులు ఇస్తామని బెదిరించి ఇన్నోవాలో తీసుకెళ్లారు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసు నిందితుల్లో ఒకడైన సాదుద్దీన్ మాలిక్‌ను నిన్న దాదాపు ఆరు గంటలకుపైగా పోలీసులు విచారించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు అతడు పొడిపొడిగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే, ఈ కేసులోని మిగతా నిందితులైన మైనర్లతో ఉన్న సంబంధాలపై అడిగిన ప్రశ్నకు పెదవి విప్పలేదని సమాచారం. కాగా నిందితులైన ఐదుగురిలో ముగ్గురు మైనర్లను న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది.
ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడు, సంగారెడ్డి జిల్లా అధికార పార్టీ నేత కుమారుడు, కార్పొరేటర్ కుమారుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు పోలీసులు విచారించనున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులైన ఎమ్మెల్యే కుమారుడు, బెంజ్ కారు యజమాని కుమారుడి కస్టడీ కోసం కోర్టు అదేశాల కోసం పోలీసులు వేచిచూస్తున్నారు. ఈ ముగ్గురు నిందితులను న్యాయవాది సమక్షంలో సివిల్ దుస్తుల్లో విచారించాలని కోర్టు ఆదేశించింది. నిందితులను గుర్తించేందుకు బాధితురాలితో టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ను నిర్వహించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more