కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మందిని బలితీసుకుంది. ఇది రెండేళ్ల క్రితం ఇది మన దేశంలోకి నవంబర్ 2019న ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ.. కొత్త కొత్త వేరియంట్లుగా పరిమాణాన్ని మార్చుకుని దాడి చేసింది. ఈ నేపథ్యంలో దేశప్రజలందరీ అందుబాటులోకి కరోనా టీకాలను తీసుకువచ్చిన కేంద్రం.. కరోనాను దేశం నుంచి తరిమివేయాలన్న ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశంలోని చిన్నారులకు మినహాయించి అందరికీ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రప్రభుత్వం.
అయిత ఈ చిన్నారులతో పాటు కరోనా టీకాలను తీసుకునేందుకు భయపడిన కొంతమందికి కూడా ఈ మహమ్మారి నుంచి ఎలాంటి హాని సంభవించకూడదని కూడా ప్రయత్నాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే అలా మానవుల నుంచి కాకుండా జంతువులకు సోకి అక్కడ రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నందున వాటికి కూడా వాక్సీన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కరోనా టీకాను జంతువుల కోసం తీసుకువచ్చింది. హర్యానాకు చెందిన ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (NRC) జంతువుల కోసం అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ టీకా ‘అనోకోవ్యాక్స్’ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు.
ఈ వ్యాక్సిన్స్ కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్‌తోపాటు ఒమిక్రాన్‌ను కూడా సమర్థంగా అడ్డుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) తెలిపింది. శునకాలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్లను కరోనా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడం కంటే సొంతంగా అభివృద్ధి చేయడం నిజంగా పెద్ద విజయమని మంత్రి తోమర్ అన్నారు. అనోవ్యాక్స్‌తోపాటు సీఏఎన్-సీవోవీ-2 ఎలీసా (CAN-CoV-2 ELISA) కిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితంగా శునకాల్లో యాంటీబాడీలను గుర్తించొచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more