A terrifying tug-of-war after orangutan attacks man through cage జూలో సందర్శకులకు చుక్కలు చూపిన ఒరెంగుటాన్.!

Visitor trespasses orangutan enclosure at indonesian zoo animal attacks by grabbing by his leg

orangutan attacks man, orangutan grabs man, man enters orangutan enclosure, indonesia zoo orangutan attacks man, Orangutan, Indonesia, zoo, visitor, ape drags man, social media, Online, Viral video

A viral video circulating on social media has captured the moment an orangutan attacked a man through the bars of its cage. The video, filmed at an Indonesian zoo, shows the ape dragging the man closer by grabbing hold of his legs and refusing to let go.

ITEMVIDEOS: బోనులో ఉన్నానని దగ్గరికి వస్తావా.? సందర్శకులకు చుక్కలు చూపిన ఒరెంగుటాన్.!

Posted: 06/10/2022 08:02 PM IST
Visitor trespasses orangutan enclosure at indonesian zoo animal attacks by grabbing by his leg

జంతు ప్రదర్శనశాలలు అదేనండీ జూలలో జంతువుల‌ ఉన్న బోనులకు అతి ద‌గ్గ‌ర‌గా వెళ్లొకూడదని అక్కడి నిర్వాహకులు చెబుతుంటారు. ఇందుకోసం జూలలో జూకీపర్లను కూడా ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇటీవల ఆఫ్రికా దేశంలోని ఒక జూలో అలా చేయవద్దని చెప్పాల్సిన జూ కీపర్ సింహం బోనులో ఉంది కదా అని దానితో ఆటలాడి అందుకు చక్కటి ప్రతిఫలంగా తన చేతి వేళ్ల చర్మాన్ని సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఇంత జరిగినా అసలేం జరుగుతుందో కూడా అక్కడి ప్రదర్శనశాల సందర్శకులకు అర్థం కాలేదు. తీరా చూసేసరికి జూకీపర్ రక్తపు గాయాలతో పరుగులు తీశాడు.

అందుకనే జూలలోకి వెళ్లినప్పుడు అక్కడి జంతువులతో కాసింత జాగ్రత్తగా ఉండాలి. అవి కావాలని చేయి చాచినా.. తగు దూరం పాటించే కానీ వాటికి పళ్లు, ఆహార పధార్థాలు అందించాలి తప్ప.. వాటికి మీరు అందే విధంగా దగ్గరికెళితే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తూ మీకే అర్థమవుతుంది. జంతువులకు దగ్గరగా వెళ్లరాదని జూ సంద‌ర్శ‌కుల‌ను నిర్వాహ‌కులు హెచ్చ‌రిస్తుంటారు. అయినా, చాలామంది వారి మాట‌లు పెడ‌చెవిన పెడ‌తారు. జూ నియ‌మాలు ప‌క్క‌కుపెట్టి ఇబ్బందుల్లో ప‌డుతుంటారు. అలాంటి వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.


ఓ సంద‌ర్శ‌కుడు ఒరెంగుటాన్ ఉన్న బోనుకు అతిద‌గ్గ‌ర‌గా వెళ్ల‌గా, అత‌డిని అది గ‌ట్టిగా ప‌ట్టేసుకున్న‌ది. ఈ వీడియో చూసి నెటిజ‌న్లు న‌వ్వాపుకోలేక‌పోతున్నారు. 32 సెక‌న్ల నిడివిగ‌ల వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో ఓ వ్య‌క్తి ఒరెంగుటాన్ బోనుకు అతిద‌గ్గ‌ర‌గా వెళ్లాడు. దీంతో అది మొద‌ట ఆ వ్య‌క్తి చొక్కాప‌ట్టి లాగింది. అనంత‌రం కాలును ప‌ట్టేసుకుంది. ఆ వ్య‌క్తి ఎంత విడిపించుకోవాల‌ని చూసిన కుద‌ర‌లేదు. చివ‌రికి ఒరెంగుటూన్ అత‌డిని వ‌దిలేసింది. ఈ వీడియో చూసిన‌వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Orangutan  Indonesia  zoo  visitor  ape drags man  social media  Online  Viral video  

Other Articles