మారుతున్న పనివేళలు, ఉద్యోగ కల్పన ఇత్యాదుల నేపథ్యంలో నూతన కార్మిక చట్టాలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ఈకొత్త కార్మికచట్టాలను అమలుపర్చాలని చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. అయితే నూతన కార్మికచట్టాలు అమల్లోకి వస్తే.. నిరుద్యోగంపై ప్రభావం చూపుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూన్నా.. అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్భణ పరిస్థితుల్లో.. చాలీచాలని జీవితాలతో జీవితాలను ఎల్లదీస్తున్న కుటుంబాలకు మరింత కష్టం తోడుకానుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది అమలులోకి వస్తే, కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వాటా, వేతనాలలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఆఫీసు వేళలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, చేతికందే వేతనం మాత్రం తగ్గే అవకాశం ఉంది. మొత్తం నాలుగు కార్మిక చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్రం ఇది వరకే ప్రకటించింది. ఇవి అమల్లోకి వస్తే దేశంలో పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చే లేబర్ కోడ్‌ల ద్వారా వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులలు (మహిళలతో సహా) తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు వస్తాయని అభిప్రాయపడింది.
కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే జరిగే మార్పులు ఇవే..
* ప్రస్తుతం ఉన్న 9 గంటల పనివేళలను 12 గంటల వరకు పెంచుకునే వెసలుబాటు ఇవ్వడంతో.. మూడు షిప్టుల్లో పనిచేయాల్సిన కార్మికులు ఇక రెండు షిప్టులకే పరిమితం కానున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఐదు రోజుల పనిదినాలు కాస్తా.. నాలుగు రోజుల పనిదినాలుగా మారనున్నాయి. అయితే మరో ఉద్యోగి చేయాల్సిన పనిని ఇద్దరు మాత్రమే పంచుకోవడంతో.. నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
* కొత్త కార్మిక చట్టాలు అమలైతే ఆఫీస్ పని వేళలను కంపెనీలు గణనీయంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 8-9 గంటల పనివేళలను 12 గంటలకు పెంచుకోవచ్చు. అయితే, అప్పుడు వారు తమ ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. వారంలో మొత్తం పని గంటల్లో మాత్రం మార్పు ఉండకపోవచ్చు.
* పరిశ్రమల్లో ఓవర్ టైం (ఓటీ) 50 గంటల నుంచి 125 గంటలకు పెరుగుతుంది.
* ఉద్యోగి, యజమాని జమ చేసే భవిష్య నిధి మొత్తం పెరుగుతుంది. మొత్తం వేతనంలో 50 శాతం బేసిక్ శాలరీ ఉండాలి. దానివల్ల భవిష్య నిధికి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది. అంతే స్థాయిలో యజమాని కూడా జమ చేయాలి. ఈ నిబంధన వల్ల కొందరు ఉద్యోగులకు, మరీ ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల టేక్ హోం శాలరీ (చేతికి వచ్చే వేతనం) గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
* పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తం, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది.
* కార్మికుడు ఉద్యోగ సమయంలో పొందగలిగే సెలవులను హేతుబద్ధీకరించింది. సాధారణంగా ఏడాదికి 240 రోజులు పనిచేస్తే ఆర్జిత సెలవులు లభిస్తాయి. అయితే, ఇప్పుడు దీనిని 180 రోజులకు తగ్గించింది. అయితే, ప్రతి 20 రోజుల పనిదినాలకు కార్మికులు తీసుకునే ఒక రోజు సెలవు విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా, వారానికి నాలుగు పనిరోజులు అమల్లోకి వస్తే.. ఇక నెల బుదులుగా 37 రోజులకు ఒక సెలవు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అర్జిత సెలవుల విషయంలో పనిదినాలను తగ్గించిన కేంద్రం.. సెలవు విషయంలో ఎందుకు తగు మార్పులు చేయలేదన్న ప్రశ్నలు కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
* కరోనా మహమ్మారి సమయంలో పలు కంపెనీలు ఉద్యోగులతో ఇంటి నుంచి పని చేయించాయి. ఇప్పుడీ ‘వర్క్ ఫ్రం హోం’కు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more